Remove derogatory content by february 6

internet, websites, social networking sites, new delhi, internet, websites, social networking sites, new delhi, internet, websites, social networking sites, new delhi

In yet another blow to 21 social networking sites including Facebook, Microsoft, Google, Yahoo and Youtube, a Delhi court has asked the 21 websites to remove all derogatory content by February 6, 2012.

Remove derogatory content by February 6.gif

Posted: 12/25/2011 12:30 PM IST
Remove derogatory content by february 6

కాలం మారింది. దాంతో పాటు మనిషి జీవన విధానం మారింది. కాలంతో పాటు పరుగెత్తడానికి మనిషి పోటీ పడుతున్నాడు. ఏ సమాచారాన్నైనా క్షణాల్లో తెలుసుకోవడానికి ప్రయత్నిస్తున్నాడు. అలాంటి సమాచారాన్ని అందుబాటులో ఉంచేవే సోషల్ నెట్ వర్కింగ్ సైట్లు. అయితే ఇవి మొన్నటి వరకు భాగానే ఉన్నా ఇప్పుడు వాటికి కష్టకాలం వచ్చే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఎందుకంటే కొందరు వ్యక్తులు సమజానికి ఉపయోగ పడే ఈ సైట్లలో అసభ్యకరమైన సమాచారాన్ని పంపిస్తున్నారు. దీనిని తీవ్రంగా పరిగణించిన కోర్టు తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. అభ్యంతరకరమైన విషయాలను వచ్చే వచ్చే ఏడాది ఫిబ్రవరి 6వ తేదీలోగా తొలగించాలని ఢిల్లీ కోర్టు 21 వెబ్‌సైట్లను ఆదేశించింది. ఆ సోషల్ నెట్‌వర్కింగ్ సైట్లలో ఫేస్ బుక్, మైక్రోసాఫ్ట్, గూగుల్, యాహూ, యూట్యూబ్ ఉన్నాయి. అభ్యంతరకరమైన వెబ్‌కాస్టింగ్ ఆరోపణలపై కోర్టు ఆ సైట్లకు సమన్లు జారీ చేసింది. ఓ ప్రైవేట్ క్రిమినల్ ఫిర్యాదుపై మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ సుదేష్ కుమార్ స్పందిస్తూ తగిన చర్యలు తీసుకోవాలని, జనవరి 3వ తేదీలోగా నివేదిక సమర్పించాలని కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించారు. ఫిబ్రవరి 6వ తేదీలోగా అభ్యంతరకరమైన విషయాలను తొలగించకపోతే ఆ వైబ్‌సైట్లు కోర్టు ధిక్కారాన్ని ఎదుర్కోవాల్సి వస్తుంది. ఈర్ష్యాద్వేషాలను రెచ్చగొట్టే, సామాజిక సామరస్యాన్ని దెబ్బతీసే మత వ్యతిరేక, సామాజిక వ్యతిరేక విషయాలను ప్రసారం చేయకూడదని కోర్టు ఆదేశించింది. అసభ్యకరమైన, అశ్లీలమైన విషయాలను వెబ్‌సైట్లు ప్రతి ఒక్కరికీ, 18 ఏళ్ల వయస్సు దాటనివారికి కూడా అందుబాటులో ఉంచుతున్నారని ఆరోపిస్తూ కోర్టుకు ఫిర్యాదు అందింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  P shankar rao gandhigiri
Cabinet expand by month end  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles