Legume vegetables

Legume Vegetables,Red Runner Bean, Assorted Beans, String Bean, Fava Bean, Mung Bean, Soybean

Legume Vegetables

Legume.gif

Posted: 01/23/2012 02:52 PM IST
Legume vegetables

Legume Vegetables

రక్తహీనతను అధిగమించడానికి ప్రొటీన్లు అధికంగా ఉండే చిక్కుళ్లు, బఠాణీలు, వేరుశనగ వంటి ద్విదళ (లెగ్యూమ్) జాతి కూరగాయలు, పప్పుదినుసులు, నూనెగింజలను తినడం వెయ్యి రెట్లు ఉత్తమమని తాజా పరిశోధనల్లో వెల్లడైంది. అమెరికాలోని చిల్డ్రన్స్ హాస్పిటల్ ఓక్లాండ్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ (సీహెచ్‌ఓఆర్‌ఐ)లో జరిగిన పరిశోధనల్లో లెగ్యూమ్ జాతి కూరగాయలను, వేరుశనగలు తినడం ద్వారానే ఐరన్ లోపాన్ని సమర్థంగా అధిగమించవచ్చని తేలింది. కూరగాయలు, వేరుశనగల ద్వారా అందుబాటులోకి వచ్చే ఐరన్‌ను జీర్ణకోశం సునాయాసంగా స్వీకరిస్తుందని నిర్ధారణైంది.
మాంసాహారం, ఐరన్ మాత్రల కంటే చిక్కుళ్లు, బఠాణీలు, వేరుశనగల వంటి ఆహారం ద్వారా వెయ్యి రెట్లు అధికంగా ఇనుమును శరీరం గ్రహించగలుగుతుందని తేలింది. శాకాహారం ద్వారా ఫెర్రిటిన్ రకం ఇనుమును శరీరం శోషించుకోవడం దీనికి కారణం. ఒక్కో ఫెర్రిటిన్ అణువులో ప్రొటీన్ పూత వేసిన వెయ్యి ఇనుప పరమాణువులు ఉంటాయని పరిశోధనలకు సారథ్యం వహించిన శాస్త్రవేత్త డాక్టర్ ఎలిజ బెత్ థీల్ ‘జర్నల్ ఆఫ్ న్యూట్రిషన్’లో రాసిన వ్యాసంలో పేర్కొన్నారు

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Jaipur literature festival oprah winfrey charms chaotic india
Us missiles kills militants in pakistan  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles