Employee new tricks

Employee new tricks, Employee's Serious Health Condition, New tricks, New plans, Office

Employee new tricks

Employee.gif

Posted: 01/28/2012 04:39 PM IST
Employee new tricks

Employee new tricks

గతంలో ఆఫీసుకు ఎందుకు లేటు అయిందని బాస్ అడిగితే.. ట్రాఫిక్ జాంలో ఇరుక్కుపోమాని, కడుపు నొప్పి అని ఏవే సాకులు చెబుతుంటాం. కానీ అవన్నీ క్రీస్తుపూర్వం నాటి సాకులు. ఆఫీసుకు ఆలస్యమైనా, అత్యవసరంగా సెలవు కావాలన్నా.. బాస్ చిందులేయకుండా సరికొత్త సాకులు చెప్పాలి. మనం చెప్పె సాకులకు బాస్ నవ్వుతూ....ఒకే అనేలా కథలు చెప్పాలి. అందుకోసం కొన్నింటిని మీకు ఇస్తున్నాను.

1. ఈ రోజు నాకు బంపర్ లాటరీ తగిలింద్ సార్. ఆ ఆనందంలో ఆఫీసు సంగతే మర్చిపోయాను.
2. దట్టంగా పొగమంచు కమ్మేసింది. అందువలన ఆఫీసుకు వస్తుంటే దారి తప్పి ఎటో వెళ్లిపోయాను.
3. రాత్రి మా ఆవిడతో గొడవైంది. తనేమో కోపంతో నా సెల్ ఫోన్ స్విఛ్చాప్ చేసేసింది. అలారం మోగలేదని అందుకే ఈ ఆలస్యం
4. నిజ్జం సార్ .. నా బైక్ తాళాలు మా కుక్క ఎక్కడో పడేసింది.
5. సారీ సార్ .. అలవాటులో పొరపాటుగా పాత ఆపీసుగా వెళ్లిపోయాను.
6. కార్పోరేషన్ వాళ్లు రోడ్లన్నీ తవ్వేశారు. గుంతలన్నీ దాటుకుంటూ వచ్చేసరికి ఈ వేళ అయింది.
7. బండిలో పెట్రోల్ పోయించడానికి జేబులో డబ్బుల్లేవు. నా ఖర్మకాలి దగ్గర్లో ఉన్న నాలుగు ఏటీఎమ్ లూ పని చేయలేదు.
8. మా ఆవిడా అభిమాన సీరియళ్లో నటి చనిపోయింది . తనని ఓదార్చడానికి ఈ రోజు సెలవు పెడుతున్నా.
9. నా బాయ్ ఫ్రేండ్ పెళ్లి సార్. అందుకే ఈ రోజు సెలవు పెడుతున్నాను.
ఇవీ బాస్ ని బోల్తా కొట్టించే సాకులు. వినడానికి ఫన్నీగా ఉన్నా ఉద్యోగుల్లో దాదాపు ముప్పై మూడు శాతం మంది ఇలాంటి కారణాలే చెబుతున్నారట. అన్నట్టు ఇవి సరదాగా నవ్వుకోవడానికే సుమా. మీరు పాటించటానికి కాదు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Indian cricket history
Sex workers re habitation plans questioned by supreme court  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles