Breathing politics all the time every where

breathing politics all the time every where, Andhra, Real funny jokes, Telangana News, Andhra, Telugu People, Tip of the day, Hmtv live, Metro wishesh, Saksi News Headlines, Sattires, INEWs Live TV, Rk-news, Etv2 live, Hmtv, Saakshi News, Telugu portal, E-tv2, Telugu News Paper, Telugu News Paper Online, Andhrajoythi, Telugu news papers, Daily news in telugu, Sakshi news paper online, Top political news, Etv2 telugu news, Andhra news, Sakshi headlines, Andhra pradesh news, Telugu News, Abn news, Telugu headlines, Hot topics store, AP headlines

pokitics-1.gif

Posted: 02/10/2012 10:44 AM IST
Breathing politics all the time every where

politics

నిన్న మేడారం జాతరలో నోరుపారేసుకున్నారంటూ తెదేపా అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు తెరాస అధ్యక్షుడు కెసిఆర్ ని తప్పుపట్టారు. తిరుపతిలో తెదేపా ఆధ్వర్యంలో జరుగుతున్న యువతరంగం కార్యక్రమంలో మాట్లాడుతూ కెసిఆర్ వ్యాఖ్యలకు చంద్రబాబు స్పందించారు. రాజకీయనాయకులు హుందాగా ప్రవర్తించాలని, నోటికి ఏ మాట వస్తే ఆ మాట అనటం సరికాదని చంద్రబాబు అన్నారు. అనవసరంగా రెచ్చిపోయి మాట్లాడటం గొప్పతనానికి సూచిక కాదని అన్నారు. రెచ్చిపోయి మాట్లాడితే బాగుండదని, తమ పార్టీలో వారు కూడా మాట్లాడగలరని హెచ్చరించారు.

కానీ ఇప్పుడేమనుకున్నా, కెసిఆర్ తాను అనుకున్నదైతే చేసేసారు. మేడారం జాతర, లక్షలాది ప్రజానీకం, ప్రత్యేక హెలికాప్టర్ లో చేరుకున్న కెసిఆర్, తెలంగాణా కోసం పుట్టిన పార్టీగా పేరు తెచ్చుకున్న తెరాస అధ్యక్షుడిగా తాను చెప్పదలచుకున్నది చెప్పటానికి అంతకంటే మంచి వేదిక ఎక్కడ లభిస్తుంది. దాని పూర్తిగా ఉపయోగించుకున్నారాయన. కెసిఆర్ మాటలలోని వ్యంగ్యానికి, చెణుకులకు, ఎత్తిపొడుపు మాటలకు, జనం వినోదంగా తీసుకుంటారు కాబట్టి, ఆయన మేడారం వేదికను రాజకీయోవన్యాసానికి వేదికగా మలచుకున్నారు. ఏమన్నా అంటే, తెలంగాణాయే నాకు ప్రధానం, దాని తర్వాతనే ఏదైనా అనేస్తారు.

అయితే, చంద్రబాబు కూడా అదే పంథాలో వెళ్ళారు. యువతను కూడదీయటానికి, వారిని ప్రోత్సహించి రాజకీయాలలోకి రప్పించటానికి ఆయన చేస్తున్న యువతరంగానికి, కెసిఆర్ మాటలను తలచుకోవటానికి సంబంధం లేదు. కానీ బహిరంగంగా మాట్లాడేదే మీడియాలో బాగా కవర్ అవుతుంది. అందుకే ఆయన నాలుకలు కోస్తామని అన్న కెసిఆర్ మాటలను మరోసారి బహిరంగంగా గుర్తు చేసుకుని, అది మంచి పద్ధతి కాదని చెప్తూనే, అలాగే గనక ప్రవర్తిస్తే తన పార్టీలో కూడా అలా మాట్లాడే ఉన్నారు సుమా అని హెచ్చరించారు.

రాజకీయాల్లో వ్యక్తిగత ధూషణలకు చరమగీతం పాడకపోతే చివరకు ప్రజలు వీరి పరస్పర ధూషణలనే గుర్తుంచుకుంటారు. వీరిలో మంచంటూ ఏమైనా ఉంటే అది మరుగునపడిపోతుంది.

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Ac travelers in railways must carry id cards
Ambedkar statue insulted again  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles