"వాలంటైన్ అంటే ఏమిటి?" అని అడిగితే ఎవరైనా "ప్రేమికులు" అని ఠక్ మని సమాధానం చెప్పటమే కాకుండా ఇది కూడా తెలియదా పాపం అన్నట్టు జాలిగా మనవంక చూస్తారు. ఫిబ్రవరి 14 వ తారీఖుని వాలెంటైన్స్ డే గా ప్రపంచమంతా పండుగ చేసుకోవటమే దానికి కారణం. ఈ రోజు ప్రేమికులు, ప్రేమను పొందదలచుకున్నవారు కలిసి శుభాకాంక్షలు తెలుపుకుని వారి వంతు వారు "ట్రై" చేసుకోవటం జరుగుతోంది. ఏదో ఒక పేరుతో వేడుక చేసుకోవటం ఆశించదగ్గదే. పైగా ఈ పేరుతో పనిదినానికి గండి కొట్టకుండా ఉండటం ఇంకా బావుంది.
నిజానికి ఆనందంగా ఉండటానికి ఒక కారణమంటూ వెతుక్కోనవసరం లేదు, ప్రణాళిక వేసుకుని ఫలానా రోజున ఆనందంగా గడుపుదామని అనుకునేదీ కాదు. కానీ ఒక అవసరం అంటూ ఏర్పడితే, సాంప్రదాయంగా తయారవుతే కనీసం ఆ రోజైనా ఆ వంకతో ఆనందంగా ఉంటారనే ఉద్దేశ్యంతో ఏర్పడ్డవే పండుగలు, వేడుక సందర్భాలు, ఆనందోత్సవాలు. అవి కాకుండా సంవత్సరంలో ఎన్నో దినాలను ప్రకటించి వాటిని అనుసరించటం వలన సత్సంబంధాలు ఏర్పడటం, ఉన్న సంబంధాలు గట్టి పడటం జరుగుతుంటుంది.
వాలంటైన్ అనేది లాటిన్ వాలెంటినస్ అనే పదం లోంచి వచ్చింది. దీని అర్థం ధృఢమైన, శక్తివంతమైన, సామర్థ్యవంతమైన, అనే అర్థాలు వస్తాయి. తేర్ని బిషప్ సెయింట్ వాలంటైన్ గురించి రాసారు కానీ ఆయన ప్రేమికులను ప్రోత్సహించినట్టుగా చరిత్రలో ఎక్కడా లేదు. కొన్నిటికి అర్థాల లోతుల్లోకి పోకపోవటమే మంచిదేమో. సైంట్ వాలంటైన్ అంటే ఒక వ్యక్తి కాదు. చర్చ్ కోసం బలిదానం చేసిన 14 మంది సైంట్స్. సెయింట్ వాలంటైన్ పేరుతో మొదట్లో చర్చిల్లో విందు వరకే ఉండేది. ఇలా 1955 వరకు సాగింది. కేథలిక్ చర్చ్ లో రోమ్ లోని త్యాగమూర్తల అధికారిక జాబితాలో ఉన్నా వీరి గురించి ఎక్కువగా వివరణ దొరకకపోవటంతో జనరల్ కాలెండర్ లోంచి వీరి ఙాపకార్థం చేసే వేడుకను తొలగించారు. కానీ 1969 నుంచి పోప్ పాల్ 6 ద్వారా కాలెండర్ తిరిగి చోటుచేసుకుంది. జఫ్రీ చౌసర్ తన పరిశీలనలో ఇది 18 వ శతాబ్దం నుంచి వస్తోందని బట్లర్స్ లైవ్స్ ఆఫ్ సెయింట్స్ అనే పుస్తకం రాసిన అల్బాన్ బట్లర్ వ్యాఖ్యానాల ప్రకారం దాన్ని చారిత్రక ఆధారంగా తీసుకుని, దానికి కొంత తన ఊహాశక్తిని కూడా జోడించి వాలెంటైన్స్ డే సాంప్రదాయాన్ని పునరుద్ధరించారు.
ఆ తర్వాత మొదట్లో ఈ రోజుని జఫ్రీ చౌసర్ అనుయాయులంతా శృంగారాత్మక ప్రేమగానే తీసుకున్నారు. కానీ 15 వ శతాబ్దం నుంచి ప్రేమను పరస్పరం తెలియజేసుకునే వారికోసం ఒకరికొకరు బహుమానాలు ఇచ్చిపుచ్చుకోవటానికి సాంప్రదాయ వేదికగా చేసుకున్నారు. ఆ విధంగా సెయింట్ వాలంటైన్ డే వాలంటైన్స్ డే గా మారి, వేడుక చేసుకునే ఆ ప్రేమికులు వాలంటైన్స్ గా పిలవబడుతున్నారు.
కేథలిక్ మార్టియోలాజీస్ లో ఫిబ్రవరి 14న వాలంటైన్ అనే సెయింట్ ప్రస్తావన ఉంది. ఆయన తన అనుచరులతో కలిసి ఈ రోజున ఆఫ్రికాలో బలిదానమిచ్చారని ఉంది కానీ అంతకంటే ఎక్కువ వివరాలు లేవు. కానీ 14 శతాబ్దంలో వాలెంటైన్ ని శృంగార దినంగా తీసుకున్న దగ్గర్నుంచీ రోమన్ వాలెంటైనా లేకపోతే తేర్ని వాలెంటీనా అన్నది మరుగునపడి కేవలం ప్రేమికుల దినోత్సవంగానే మిగిలిపోయింది.
జఫ్రీ చౌసర్ ప్రేమ పక్షుల గురించి చెప్తూ, ఈ రోజున ప్రతి పక్షీ తన జోడీదారుని వెతుక్కుంటుంది అని రాసారు. కానీ ఫిబ్రవరి మాసం మధ్యలో పక్షులు కలిసే సమయం కానే కాదు. పశుపక్ష్యాదులు మైథునానికి కొన్ని సీజన్లను ఎంచుకుంటాయి. అందులో పక్షులకు అనుకూలమైన రోజు కాదిది. కానీ ప్రేమికులను ప్రేమ పక్షులుగా వర్ణించబడ్డవారు మానవులే. మానవులకు సీజనంటూ ఏమీ లేదు సరికదా వేళాపాళలు కూడా లేకుండా పోయాయి. కాబట్టి మనుషులకైతే ఇది కూడా అనుకూలమైన దినమే.
బారతదేశంలోనూ ఒక వాలంటైన్ డే ఉంది. అదే హోలీ. పూర్వకాలంలో రంగులు చల్లుకుంటూ మిఠాయి ఒకరికొకరు ఇచ్చిపుచ్చుకుంటూ, కొత్తవారితోనైనా కలిసిపోవటం, లింగభేదం, సమాజంలో చిన్న పెద్ద తారతమ్యాలు లేకపోవటం ఉండేది. నిజంగా ప్రేమను పంచిపెట్టుకునేవారు. అయితే క్రమంగా వయసు వచ్చినవారు ఆరోజు ఆటవిడుపుగా యువతతో కలిసిపోవటానికి సందర్భంగా మారి సాంప్రదాయమిచ్చిన స్వేచ్ఛను ఉపయోగించుకోవటం మొదలుపెట్టారు. అయితే అది పెడతోవన పడుతుండటంతో, ఆ వంకన కేవలం ఆడపిల్లలకు చేరువ కావటానికే చూస్తుండటంతో సాంప్రదాయాలను చెడగొడుతుందనే ఉద్దేశ్యంతో తెలిసిన వారితోనే హోలీ ఆడటం, వారి అనుమతితోనే రంగులు పూసుకోవటం, తెలిసినవారికే మిఠాయి ఇవ్వటం, ఆడ మగ భేదాన్ని పాటించటం వచ్చింది. అదే సమయంలో వచ్చిన ఈ వాలంటైన్ డే దానికి ప్రత్యామ్నాయం గా కనపడింది ప్రేమికులకు. అందు వలన ఈ కాలంలో హోలీని బాగా కత్తిరించి కుదించి, దాన్ని అక్కడికే పరిమితం చేసి, ప్రేమికులంతా వాలంటైన్స్ డే ని పాటించటం మొదలుపెట్టారు.
పాశ్చాత్య రంగు పులుముకోవటం వలన మన దేశీ రంగుల పండుగ నుంచి తప్పుకున్న ప్రేమికులు, ఈ విదేశీ వాలంటైన్స్ డే ని తమ హృదయాలను విప్పి చూపించటానికి ఉపయోగిస్తున్నారు. ఆ క్రమంలో ఒకరినొకరు ఆకర్షించుకునే ప్రయత్నాలు చెయ్యటం, దాన్ని ఎవరూ తప్పు పట్టకపోవటం ఆనవాయితీ అయింది. పాశ్చాత్య దేశాల్లో లాగా తల్లిదండ్రుల అనుమతితో డేటింగ్ చేసే దశకు రాకపోయినా, ప్రేమికులు వాళ్ళల్లో వాళ్ళు ప్రేమను తెలియజేసుకోవటానికి ఉపయోగించుకుంటున్నారు.
వాలెంటైన్స్ దినోత్సవ శుభాకాంక్షలు- తెలుగువిశేష్.కామ్
-శ్రీజ
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more