రాష్ట్ర ప్రజల సంక్షేమం, సమస్యల పరిష్కారాలపై చర్చించాల్సిన చోట.. ప్రజా ప్రతినిధుల పరస్పర దూషణలు హోరెత్తాయి. ‘‘నువ్వు ఎమ్మెల్యే టికెట్టు కోసం అర్ధరాత్రి కాళ్లు పట్టుకున్నావు’’ అని ఒకరంటే.. ‘‘అలా మాట్లాడితే నువ్వు హైదరాబాద్‌లో తిరగలేవు’’ అని మరొకరు హెచ్చరించారు. ‘‘నువ్వొక బజారు రౌడీవి నీతో మాటలా?’’ అని ఇంకొకరు వ్యాఖ్య చేస్తే.. నువ్వు పోషించే బజారు రౌడీలందరినీ వేళ్ల (ఫింగర్ టిప్స్) మీద ఆడిస్తా అని మరొకరు రెచ్చిపోయారు. ఈ తతంగమంతటికీ అసెంబ్లీ వేదికైంది. విద్యుత్ కోతలపై ప్రతిపక్ష, అధికార పార్టీ సభ్యుల మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. దీంతో అసలు సమస్య అటకెక్కింది. ఈ దూషణల పర్వం ఎక్కడ ప్రారంభమై ఎక్కడ ముగిసిందో ఒక్కసారి చూద్దాం.
రెడ్డి : 2004 ఎన్నికలకు ముందు విద్యుత్ ఒప్పందాలను పునఃసమీక్షిస్తామని అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ఆ పనిచేయలేదు. ఇప్పుడు మాట్లాడుతున్న వాళ్లు 2004లో అర్ధరాత్రి చంద్రబాబు కాళ్లు పట్టుకుని ఎమ్మెల్యే టికెట్ తీసుకుని గెలిచారు. అందులో మంత్రి కూడా ఉన్నారు. (మంత్రి దానం నాగేందర్‌ను ఉద్దేశించి)
దానం : నేను కాళ్లు పట్టుకున్నానా.. లేక వాళ్ల మనుషులే వచ్చారా.. అన్నది పక్కన పెడదాం. సొంత మామ మీదనే పోటీ చేస్తానని చెప్పిన ఓ వ్యక్తి కాంగ్రెస్ నుంచి వెళ్లిపోయాడు. అలాంటి వ్యక్తి పార్టీలో ఉండలేక ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి మళ్లీ కాంగ్రెస్‌లోకి వచ్చాను. ఇలాగే మాట్లాడితే హైదరాబాద్‌లో తిరుగనివ్వం. కేరాఫ్ అడ్రస్ ఉండదు.
బాబు: మాకు రక్షణ కల్పించండి. మేం అసెంబ్లీని వదిలిపెట్టి వెళ్లం. మాకు భయమవుతోంది. మమ్మల్ని భయపెడుతున్నారు. ఒక రౌడీ.. మంత్రి అయి కూడా బెదిరిస్తాడా? ఆయన అంత గొప్ప వ్యక్తా? టీడీపీ హయాంలో ఇలాంటి బజారు రౌడీలను ఇళ్లలో నుంచి రాకుండా చేశాం. ఒక ఎమ్మెల్యేను బజారు రౌడీ కంటే హీనంగా భయపెడతాడా? నీ తోకలు కత్తిరిస్తా. (మైక్ కట్)
మంత్రి శ్రీధర్ బాబు : మా మంత్రి దానం అసత్య మాటలు మాట్లాడితే హైదరాబాద్‌లో తిరుగనివ్వం అన్నారే, కానీ ఎవర్నీ బెదిరించలేదు. దీన్ని అనవసరంగా రాజకీయం చేయొద్దు.
దానం : అడ్డగోలుగా మాట్లాడినందుకు బాబే క్షమాపణ చెప్పాలి. చంద్రబాబు రౌడీలను ప్రోత్సహించేలా మాట్లాడుతున్నాడు. ప్రజల మధ్య నుంచి వచ్చినోన్ని. హైదరాబాద్ ప్రజలు ఇలా మాట్లాడితే నొచ్చుకుంటారు. వాళ్లకు కోపం వస్తే మీరెవరూ ఇక్కడ తిరుగలేరు. మాకు తెలుసు మిమ్మల్ని ఎలా ఎదుర్కోవాలో. ఎలాంటి రౌడీలనైనా ఫింగర్‌టిప్స్ మీద ఆడిస్తాం. ఏదైనా ఉంటే బయట తేల్చుకుందాం. బాబు ఇంగితజ్ఞానం లేకుండా మాట్లాడుతున్నాడు. నేనేమీ తప్పుగా మాట్లాడలేదు. ఏదైనా ఉంటే రికార్డులో నుంచి తొలగించాలి.
ఈ సమయంలో టీడీపీ ఎమ్మెల్యేలు రౌడీ మంత్రిని బర్తరఫ్ చేయాలని పెద్ద పెట్టున నినాదాలు చేశారు. స్పీకర్ పోడియం వద్దకు వెళ్లి సభను అడ్డుకునేందుకు యత్నించారు. దీనిపై ముఖ్యమంత్రి మాట్లాడాలని బాబు డిమాండ్ చేశారు. దీంతో స్పీకర్ ముఖ్యమంవూతికి మైక్ ఇచ్చారు.
సీఎం : ముందు మొదలు పెట్టింది రేవంత్‌డ్డి. మంత్రిని అవమానించేలా మాట్లాడాడు. (రేవంత్‌డ్డిని ఉద్దేశించి) మీరు కూడా చంద్రబాబు కాళ్లు పట్టుకుంటే టికెట్ ఇచ్చారా? దానం గెలుస్తడని టికెట్ ఇచ్చారు. గెలిచాక అక్కడ ఉండలేక మళ్లీ కాంగ్రెస్‌లోకి వచ్చారు. కించపర్చేలా మాట్లాడొద్దు. మంత్రి కూడా ఆవేశపడొద్దు. వారి వ్యాఖ్యలను రికార్డుల నుంచి తొలగించాలి.
అనంతరం రేవంత్‌డ్డి, మంత్రి దానం మాటలను రికార్డుల నుంచి తొలగిస్తున్నట్లు స్పీకర్ ప్రకటించారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more