Ram charans racha movie working stills

Ram Charans Racha Movie Working Stills,Racha movie stills. Racha Movie shooting stills,Racha movie shooting Launch - Live from Ramanaidu studios. VIDEOS, Part 1 Ramcharan , Racha , Chiranjeevi,

Ram Charans Racha Movie Working Stills

Ram Charans.gif

Posted: 03/27/2012 10:58 AM IST
Ram charans racha movie working stills

Ram Charans Racha Movie Working Stills

‘కాలికి దెబ్బతగిలినా పెయిన్ కిల్లర్స్ వేసుకొని నొప్పిని భరిస్తూ సినిమా షూటింగ్ చేస్తున్నా. నా వల్ల సినిమా విడుదల ఆలస్యం కావొద్దన్నదే నా ఉద్ధేశ్యం. ‘రచ్చ’ సినిమాలో ప్రతి అంశం ప్రేక్షకుల్ని కట్టిపడేసేలా వుంటుంది’ అని అన్నారు రామ్‌చరణ్. ఆయన కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం ‘రచ్చ’. తమన్నా నాయిక. సంపత్ నంది దర్శకుడు. మెగా సూపర్‌గుడ్ ఫిలిమ్స్ పతాకంపై యన్.విపసాద్, పారస్‌జైన్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ఈ చిత్రం హైదరాబాద్‌లో పాట చిత్రీకరణ జరుపుకుంటోంది.

ఈ సందర్భంగా సోమవారం ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో రామ్‌చరణ్ మరిన్ని విశేషాలు తెలియజేస్తూ ‘ఈ సినిమా కోసం సంపత్‌నంది చెప్పిన స్క్రిప్ట్ హైలెట్. సిటీ నేపథ్యంలో కథ నడుస్తుంది. అన్ని కమర్షియల్ అంశాలున్న ప్రేమకథా చిత్రమిది. ఈ చిత్రంలో నన్ను కొత్త కోణంలో చూస్తారు.

ఆడియోకు మంచి స్పందన లభిస్తోంది. ముఖ్యంగా ‘వానా వానా వెల్లువాయే’ పాటకు చక్కటి ప్రశంసలు లభిస్తున్నాయి. ఈ పాటలో నాన్నలా హావభావాల్ని ప్రదర్శించడానికి చాలా కష్టపడ్డాను’ అన్నారు. దర్శకుడు సంపత్‌నంది మాట్లాడుతూ ‘ఏప్రిల్ లో రచ్చ చేయడానికి అందరూ సిద్ధంగా వుండండి. ప్రేక్షకులందరికీ విందుభోజనంలా వుంటుందీ చిత్రం. పాటలకు అద్భుతమైన ప్రజాదరణ లభిస్తోంది’ అన్నారు. తమ న్నా మాట్లాడుతూ ‘ఈ సినిమా షూటింగ్ కోసం ప్రపంచాన్నంతా చుట్టి వచ్చాను.

బన్నీ, రామ్‌చరణ్ వల్ల డ్యా న్స్ బాగా నేర్చుకు న్నాను. సినిమా విడు దల కోసం అందరిలాగే నేను కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్నాను’ అన్నారు. నిర్మాత యన్.వి. ప్రసాద్ మాట్లాడుతూ ‘బ్యాలన్స్‌గా వున్న పాటను పొల్లాచ్చిలో చిత్రీకరిస్తాం. ఏప్రిల్ 5న సినిమాను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం’ అన్నారు. మంగళవారం రామ్‌చరణ్ జన్మదినాన్ని పురస్కరించుకొని యూనిట్ సభ్యుల సమక్షంలో కేక్‌ను కట్ చేశారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Did not offer army chief 14 crore bribe says retired officer
Man accused of beating dog to death  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles