Ipl payment for lalu yadavs son without playing a single match

IPL payment for Lalu Yadav's son without playing a single match,Tejashwi Yadav, Delhi Daredevils, IPL, Lalu Yadav, BCCI, Jaydev Shah, Niranjan Shah

IPL payment for Lalu Yadav's son without playing a single match

Lalu Yadav.gif

Posted: 04/06/2012 09:40 AM IST
Ipl payment for lalu yadavs son without playing a single match

IPL payment for Lalu Yadav's son without playing a single match

జాతీయ జట్టు ఎంపికకు ప్రతిభే కొలమానం. ఐపీఎల్ కూడా ఇందుకు మినహాయింపు కాదు. పొట్టి క్రికెట్‌కు అతికినట్టు సరిపోయే ఆటగాళ్లను ఆయా జట్లు ఏరి కోరి మరీ తీసుకుంటాయి. అలాంటిది ఐపీఎల్‌లో ఒక్క మ్యాచ్ కూడా ఆడకుండానే ఓ ఆటగాడు (?) నాలుగేళ్లుగా జట్టులో ఉంటున్నాడంటే.. ఎవరైనా విస్తుపోవాల్సిందే! డ్రెస్సింగ్ రూమ్‌లో తప్ప మైదానంలో అసలు కనిపించడు. ఇప్పటిదాకా దాదాపు 30-40 లక్షల రూపాయల పారితోషికం తీసుకున్నాడు.

ఇక జాతీయ అండర్-19 జట్టుకూ ఎంపికైనా ఇతగాడు ఆడిందిలేదు. వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా ఇది నిజంగా నిజమే! ఇంతకీ ఆ ఘనుడు ఎవరంటే.. బీహార్ మాజీ ముఖ్యమంత్రి, కేంద్ర రైల్వే శాఖ మాజీ మంత్రి, రాష్ట్రీయ జనతాదళ్ అధ్యక్షుడు లాలూ ప్రసాద్ యాదవ్ పుత్రరత్నం తేజస్వి యాదవ్! లాలూ కొడుకా.. మజకానా! ఐపీఎల్‌లో ఢిల్లీ డేర్‌డెవిల్స్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్న 22 ఏళ్ల తేజస్వి గత నాలుగు సీజన్లలో ఒక్కటంటే ఒక్క మ్యాచ్ కూడా ఆడిన పాపానపోలేదు.

తాజాగా జరుగుతున్న ఐపీఎల్-5లోనూ ఢిల్లీ జట్టులో ఉన్నాడు. కాకపోతే మైదానంలో కనిపించడంతే! మనోడు 2010 నుంచి దేశవాళీ క్రికెట్‌లో ఆడకపోయినా ఢిల్లీ యాజమాన్యం అతణ్ని జట్టులో కొనసాగిస్తోంది. ఏదేమైనా తేజస్వి క్రికెట్ ప్రతిభాపాటవాలు మెచ్చి జట్టులోకి తీసుకోలేదనే విషయం అర్ధమవుతోంది. 'నాకూ ఆడాలనే ఉం ది. కానీ జట్టులో చాలామంది ప్రతిభావంతులైన ఆటగాళ్లున్నారు. అవకాశం కోసం ఎదురు చూస్తున్నా. అంతర్జాతీయ క్రికెటర్లతో డ్రెస్సింగ్ రూమ్ పంచుకోవడం సంతోషంగా ఉంటుంది' అని తేజస్వి సెలవిచ్చాడు.

IPL payment for Lalu Yadav's son without playing a single match

ఇక 2008లో అండర్-19 ప్రపంచ కప్‌కు ఎంపిక చేసిన 15మంది సభ్యుల జట్టులో తేజస్వికి తొలుత స్థానం దక్కలేదు. అయితే, లాలూ జోక్యంతో సీన్ మారిపోయిందట. బీసీసీఐ ఏకంగా నిబంధనలను మార్చి మరో ఐదుగురిని ఎంపిక చేసింది. ఆ ఐదుగురిలో తేజస్వి కూడా ఉన్నాడు. ఇంతా చేసింది అతని క్రికెట్ ముచ్చట తీరడానికా అంటే కానే కాదు. పోనీ డబ్బుల కోసమా అంటే లాలూ ముద్దుల తనయుడికి ఆ అవసరమేలేదు. తేజస్వికి ఎందుకంత ఆసక్తి అంటే.. అంతర్జాతీయ స్టార్లతో డ్రెస్సింగ్ రూమ్ పంచుకోవడం ఇతగాడికి స(దు)రదానట! క్రికెటర్ కావడానికి ఆట అవసరం లేదనడానికి లాలూ సుపుత్రుని ఉదంతమే నిదర్శనం! అన్నట్టు ఈ కుర్రాడు ఏదో ఒకరోజు టీమిండియా డ్రెస్సింగ్ రూమ్‌లో దర్శనమిచ్చినా ఆశ్చర్యపోవాల్సిన పనిలేదు

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  India wants results not saints not antony but nitish modi sheila
Australia in west indies 2012 deonarine on probationary return  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles