Amarnath yatra piligrims schedule release

amarnath yatra piligrims schedule release

amarnath yatra piligrims schedule release

29.gif

Posted: 04/22/2012 05:09 PM IST
Amarnath yatra piligrims schedule release

              amarnathమీరు అమరనాథ్ యాత్రకు వెళ్లాలనుకుంటున్నారా అయితే ఇది చదవండి.  పవిత్ర తీర్థయాత్ర అమర్‌నాథ్ యాత్రకు వెళ్లే యాత్రికుల సౌకర్యార్థం ఈ యేడాది వచ్చే మే నెల నుంచే రిజిస్ట్రేషన్లను ప్రారంభించాలని అమర్‌నాథ్ ఆలయ బోర్డు ముఖ్య కార్యనిర్వహణాధికారి నవీన్ కె.చౌదరి వెల్లడించారు. దీనిపై ఆయన ఇవాళ ఒక ప్రకటన విడుదల చేశారు. ఈ రిజిస్ట్రేషన్లు దేశ వ్యాప్తంగా 174 బ్యాంక్ శాఖల్లో ఆన్‌లైన్ ద్వారా రిజిస్ట్రేషన్లు చేయించుకోవచ్చన్నారు. ఈ దఫా యాత్రను బల్తాల్, చందనవారీ మార్గాల మీదుగా అనుమతిస్తామన్నారు. రిజిస్ట్రేషన్లను 121 జమ్మూ-కాశ్మీర్ బ్యాంక్ శాఖల్లో, 49 ఎస్ బ్యాంక్ శాఖల్లో చేసుకోవచ్చని వివరించారు. గత ఏడాది 121 బ్యాంకు శాఖలకు అనుమతిస్తే, ఈసారి ఈ శాఖల సంఖ్యను 174కు పెంచినట్టు ఆయన తెలిపారు.             

           అయితే, అమర్‌నాథ్ యాత్రకు వెళ్లాలనుకునే భక్తులకు ఆరోగ్య పరీక్షలు తప్పనిసరన్నారు. యాత్ర పర్మిట్‌కు చేసుకునే దరఖాస్తులతో పాటు గుర్తింపు పొందిన వైద్యుల నుంచి ద్రువీకరణ పత్రాలను కూడా జత చేయాల్సి ఉంటుందని తెలిపారు. వైద్య పరీక్షలు జరిపినట్టు ద్రువీకరణ పత్రాలులేని దరఖాస్తులను పరిశీలించబోమని ఆయన తన ప్రకటనలో పేర్కొన్నారు. ఇవన్నీ భక్తుల మేలు ద్రుష్టిలో ఉంచుకుని నిర్ణయించిన నియమావళి గా ఆయన పేర్కొన్నారు.

...avnk

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Tea to be declare as national drink
Pcc chief botsa satyanarayana fire on chandrababi  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles