Ysr congress party president jagan new words abt his photo

ysr congress party president jagan new words abt his photo

ysr congress party president jagan new words abt his photo

5.gif

Posted: 04/26/2012 01:02 PM IST
Ysr congress party president jagan new words abt his photo

                మానాన్న ఫొటోతో పాటు నా ఫొటో కూడా పెట్టుకుందురు గాని  అంటున్నారు దివంగత నేత వై.ఎస్. రాజశేఖర రెడ్డి తనయుడు జగన్. మానాన్న అమలు చేసిన సంక్షేమ పథకాలు అనేక మంది పేదల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయాయని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి మరోమారు స్పష్టం చేశారు. నాకు అధికారం కట్టబెడితే  తాను కూడా అదేవిధంగా పాలిస్తానని జగన్ హామీ ఇచ్చేస్తున్నారు. తాను ముఖ్యమంత్రినైతే తన తండ్రి వైఎస్సార్‌తో పాటు తన ఫోటో కూడా పెట్టుకునేలా రాష్ట్రాన్ని పాలిస్తానని జగన్ అంటున్నారు.
                  jaganపశ్చిమగోదావరి జిల్లాలో పర్యటిస్తోన్న జగన్ ముందుగా నరసాపురం పట్టణంలోని స్టేషన్ పేట నుంచి రోడ్ షో ప్రారంభించారు. ముందుగా చర్చిలో ప్రార్థనలు చేశారు. తర్వాత పాతబజార్‌లోని మసీదులో నమాజు చేశారు. పీచుపాలెంలోని అమ్మవారి ఆలయంలో పూజలు నిర్వహించారు. అనంతరం లక్ష్మణేశ్వరం, రాజుల్లంక, దర్భరేవు, మర్రితిప్ప, బియ్యపుతిప్ప, వేములదీవి వెస్ట్, ఈస్ట్, సరుదుగొడప గ్రామాల మీదుగా రోడ్‌షో సాగింది. 11 కిలోమీటర్ల మేర సాగిన ఈ షోలో లక్ష్మణేశ్వరం, వేములదీవి గ్రామాల్లో మినహా మిగిలిన అన్ని చోట్లా ప్రజా స్పందన కరవైంది. దీంతో జగన్ వేములదీవిలో తప్ప మరెక్కడా ప్రసంగించలేదు.
                   ఈ ఉదయం జగన్ 8 గంటలకు నరసాపురం మండలం వడ్డివానిమెరకలో రోడ్ షో ప్రారంభించి అనంతరం కరీంశెట్టివారిపాలెం, పెదమైనవానిలంక, తూర్పుతాళ్లు చామకూరిపాలెం, మోడి మీదుగా ఎల్బీచర్ల, పరసావారిమెరక, పీతానివారిమెరక,  వైఎస్‌పాలెంలో రోడ్‌షో నిర్వహిస్తారు.

...avnk

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Karthik reddysays i dont know who is bhanu
Dammu benefit show ticket rate  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles