Cm kiran change after june 12

AP news, Latest India News, Breaking News, Headlines, News today, news of today, Hyderabad News, online news, Business, todays news, Sports, Entertainment, Movies

P Shankar Rao addressed the media in front of the CLP office, as it was locked. He said that there will be major change after June 12. He lashed out at CM Kiran kumar Reddy.

CM Kiran change after June 12.GIF

Posted: 05/10/2012 09:12 PM IST
Cm kiran change after june 12

Shankar-raoఈ మధ్యన మాజీ మంత్రి శంకర్ రావుకి, సీఎం కిరణ్ కుమార్ రెడ్డికి అస్సలు పడటం లేదు. వీరిద్దరి మధ్య పచ్చి గడ్డి వేస్తే కూడా భగ్గుమనే స్థాయికి చేరాయి వీరి విభేధాలు. సీఎం కిరణ్ కుమార్ పై నిత్యం సంచలనాత్మక ప్రకటనలు చేసే శంకర్ దాదాకి కళ్ళెం వేయడానికి సీఎం కిరణ్ ఓ ప్లాన్ వేశాడు. మీడియా సమావేశాలను నిరోధించడానికి కాంగ్రెసు శానససభా పక్షం (సిఎల్పీ) కార్యాలయానికి గురువారం తాళం వేశారు.

దీంతో సోనియా గాంధీకి జై అంటూ నినాదాలు చేస్తూ శంకరరావు కార్యాలయం ద్వారం వద్ద కూర్చున్నారు. పార్టీకి వ్యతిరేకంగా శంకరరావు మాట్లాడుతున్నారనే ఆరోపణతో సిఎల్పీ కార్యాలయానికి తాళం వేశారు. తాను క్రమశిక్షణా రాహిత్యానికి పాల్పడలేదని శంకరరావు చెప్పారు.
దీంతో మరింత రెచ్చిపోయిన శంకర్ దాదా మాటల వాగ్భాణాలకు మళ్ళీ పదును పెట్టాడు. ఈ సారి ఏకంగా సీఎం కిరణ్ పదవి కాలం కొన్నిరోజులే అని మరీ లెక్కబెట్టి చెప్పాడు. వచ్చే నెల 12వ తేదీ తర్వాత రాష్ట్రానికి శనిపోతుందని ఆయన అన్నారు. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డికి ఇక 33 రోజులే ఉన్నాయని, ఆ తర్వాత పరిస్థితిని మీరే చూస్తారని ఆయన అన్నారు.

కొస మెరుపు ఏంటంటే... ఇన్ని రోజులు వైయస్ జగన్ పై ఫైర్ అయిన శకంరన్నా ఇప్పుడు జగన్ పై ప్రేమ కురిపించాడు. వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్ అక్రమంగా సంపాదించిన సొమ్మును పేదల కోసం, మంచిపనులకు ఖర్చు చేయాలని ఆయన సూచించారు. పేర్ల మీద స్మారకాలను నిర్మించి, మంచి పనులు చేస్తే జగన్‌కు మంచి భవిష్యత్తు ఉంటుందని ఆయన అన్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Botchas gunman injured as carbine misfires
All are know about ys jagan attitudechiru  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles