శంకర్ దాదా ఎంబిబియస్ సినిమా చూశారా? సరిగ్గా అలాగే ఓ వ్యక్తి డాక్టర్ అవతారమెత్తాడు. డాక్టర్ పట్టా లేకపోయినా వైద్యం చేసేస్తున్నాడు. అదీ చిన్నా చితకా డాక్టర్ కాదండీ. ఎండి ఫిజీషియన్ గా చెప్పుకుంటూ చక్రం తిప్పేస్తున్నాడు. ఫేక్ సర్టిఫికెట్లతో ఓ పెద్ద ఆసుపత్రిలో చేరి లక్షల జీతం దండుకుంటూ బురిడీ కొట్టించాడు. యాజమాన్యానికి అనుమానం రావడంతో సదరు డాక్టర్ గారిని పోలీసులకు అప్పగించింది.
కొడితే ఏనుగు కుంభస్ధలాన్నే కొట్టాలనుకున్నట్టున్నాడు. ఇక్కడ కనిపిస్తోన్న ఈ వ్యక్తి అందుకు ఏం చెయ్యాలా ? అని బాగా ఆలోచించాడు. కాసులు కురిపించే డాక్టరైతే బావుంటుందని నిర్ధారించుకున్నాడు. అనుకున్నదే తడవుగా బాగా వెతికి వెతికి ఓ డాక్టర్ గారి సర్టిఫికేట్లను సంపాదించాడు. ఇంకేముంది రెడ్డిగారల్లా రాహుల్ గా మారిపోయాడు. ఓ ఫైన్ మార్నింగ్ వైట్ అండ్ వైట్ తో నీట్ గా టక్ చేసుకొని ఓ హస్పిటల్ ఇంటర్యూకు వెళ్లాడు. సెలక్ట్ అయిపోయాడు. ఇదంతా ఏదో సినిమా కథ అనుకుంటున్నారు కదూ.
ఈ ప్రబుద్ధుడి పేరు. రవీందర్ రెడ్డి. రంగారెడ్డి జిల్లా ఇంబ్రహీం పట్నం మండలం బీరేడు గ్రామానికి చెందిన రెడ్డి రవీందర్ రెడ్డి డాక్టర్ పట్టాకోసం ఏకంగా డాక్టర్ ఎన్ రాహుల్ గా పేరు మార్చేసుకున్నాడు. కరీంనగర్ లోని గురుదత్తా ఆసుపత్రి యాజమాన్యం డాక్టర్ కావాలంటూ ప్రకటన ఇవ్వడంతో తనకు పరిచయం ఉన్న డాక్టర్ ఎన్ రాహూల్ కు సంబంధించిన పట్టాను చూపించి తనకు తాను డాక్టర్ రాహూల్ గా పరిచయం చేసుకుని ఉద్యోగానికి చేరాడు. తనకున్న అనుభవంతో నాలుగు నెల్లుగా నెలకు లక్షా ఏభైవేలు జీతం తీసుకుంటూ డాక్టర్ గా పని చేస్తున్నాడు. అనుమానం వచ్చిన ఆసుపత్రి యాజమాన్యం లోతుగా పరిశీలించగా దొంగ డాక్టర్ గా తేలిపోయింది. యాజమాన్యానికి విషయం తెలియడంతో సదరు డాక్టర్ నెమ్మదిగా అక్కడినుంచి జారుకున్నాడు. ఆసుపత్రి వర్గాల ఫిర్యాదు మేరకు పోలీసులు పక్కా ప్లాన్ తో రవీందర్ రెడ్డిని పట్టుకొని కటకటాల్లోకి సాగనంపారు. ఫేక్ డాక్టర్ల వల్ల సామాన్య ప్రజలకు తీవ్ర ప్రమాదముందని ఇలాంటి వారి గురించి తెలిసినా , అనుమానం వచ్చినా తమకు సమాచారం అందించమని పోలీసులు విజ్ఞప్తి చేస్తున్నారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more