Miniskirt ban at san jose school

Miniskirt ban at San Jose school

Miniskirt ban at San Jose school

Miniskirt.gif

Posted: 06/19/2012 10:49 AM IST
Miniskirt ban at san jose school

Miniskirt ban at San Jose school

ఇప్పుడు ప్రతి స్కూల్ తమ విద్యార్థులకు ఒక యూనిఫామ్ ఇవ్వటం  పరిపాటిగా సాగుతుంది.  కొన్ని  స్కూల్స్ యూనిఫామ్ పేరుతో.. అబ్బాయిలకు ..ఫ్యాంట్, షర్ట్ ఇవ్వటం మాములే. కానీ అమ్మాయిలకు  మినీ స్కర్టులను ఇవ్వటం  సర్వసాధరణమైంది. అమ్మాయిలు వేసుకొని మినీ స్కర్టు వలన అనేక ఇబ్బందులు తలెత్తుతున్నాయి.  విద్యపైనే మనసు నిమగ్నం చేయాల్సిన పిల్లల్ని లైంగిక భావాలకు దూరంగా ఉంచేందుకు బ్రిటన్‌లోని ఓ స్కూల్ యాజమాన్యం స్కర్టులను నిషేధించింది. బ్రిటన్‌లోని నార్త్‌ఏంప్టన్‌షైర్‌లోని వౌల్టన్ స్కూలు యాజమాన్యం తమ వద్ద చదివే బాలికలు విధిగా నల్లటి పాంట్లు ధరించాలని తాజాగా నిబంధనలు విధించింది. స్కర్టులు ధరించకుండా వచ్చే బాలికలకు తమ స్కూల్‌లోనే ప్యాంట్లు ఇస్తామని లేదా దుస్తులు మార్చుకునేందుకు ఇళ్లకు పంపుతామని వౌల్టన్ స్కూల్ ప్రధానోపాధ్యాయుడు ట్రెవర్ జోన్స్ ప్రకటించారు.

ఈ నిబంధనను అమలు చేసేందుకు తొలిదశలో తాము కొంత సరళంగా వ్యవహరించినా, ఆ తర్వాత మరింత కఠినతరం చేస్తామన్నారు. లైంగిక భావజాలం పిల్లల్లో వ్యాపించకుండా ఉండాలన్న సంకల్పంతోనే విప్లవాత్మకమైన ఈ నిర్ణయాన్ని తీసుకున్నట్లు ఆయన పేర్కొన్నారు. చాలామంది బాలికలు మోకాళ్ల పైభాగం కూడా కనిపించేలా స్కర్టులు వేసుకువస్తున్నారని, మరికొంత మంది వస్తధ్రారణ పాఠశాలకు బదులు నైట్‌క్లబ్‌లను తలపిస్తున్నాయని జోన్స్ అభిప్రాయపడ్డారు. ఇలాంటి వస్తధ్రారణ వల్ల పిల్లల మనసులపై తీవ్ర ప్రభావం పడుతోందన్నారు. కురచ దుస్తుల వల్ల లైంగిక భావావేశాలతో వారు మానసికంగా ఒత్తిడికి లోనవుతున్నారని అన్నారు. స్కర్టులను మోకాళ్ల కింది వరకూ వేసుకోవాలని గతంలో ‘డ్రెస్ కోడ్’ను సవరించామని, అయితే అవి అమలు కానందున నేడు నిబంధనలను మళ్లీ మార్చాల్సి వచ్చిందని ఆయన వివరించారు. ‘స్కర్టుల పొడవు పెంచాలన్న నిబంధనలను ఖాతరు చేయకపోవడంతో ఇపుడు వాటిపై పూర్తి స్థాయిలో నిషేధం విధించాల్సి వచ్చింది’- అని జోన్స్ చెబుతున్నారు. తమ సూచనలపై విద్యార్థినులు, వారి తల్లిదండ్రుల నుంచి వ్యతిరేకత వ్యక్తమైనా, పిల్లలకు పాఠశాలలు అన్ని విధాలా శ్రేయస్కరంగా ఉండాలన్నదే తమ ధ్యేయమన్నారు. 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  China sends its first female astronaut into space
Panic incident in tamilnadu  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles