మీరు ఎడారిలో చిక్కుకుపోయారనుకోండి.. మీరు ప్రయాణిస్తున్న కారు కూడా చెడిపోయింది. చుట్టూ ఎడారి. అప్పుడేం చేస్తారు? ప్రాణాలపై ఆశలు వదిలేసుకుంటారు. అంతేగా.. ఫ్రాన్స్ కు చెందిన ఎలక్ట్రీషియన్ ఎమిలీ లీరే ఏం చేశాడో తెలుసా? ఆ చెడిపోయిన కారునే బైక్‌లా మార్చేసి ప్రాణాలు దక్కించుకున్నాడు!
ఇంతకీ విషయమేమిటంటే.. 20 ఏళ్ల క్రితం ఎమిలీ.. మొరాకోలోని టాన్-టాన్ పట్టణం నుంచి ఎడారి గుండా తన సిట్రియాన్ కారులో బయల్దేరాడు. కొంత దూరం ప్రయాణించాక.. ఓ మిలటరీ పోస్టు వద్ద సైనికులు అతడిని ఆపేశారు. ఇదంతా నిషిద్ధ ప్రాంతమని.. ముందుకు వెళ్లడానికి వీల్లేదని చెప్పారు. దీంతో చేసేది లేక అతడు వెనక్కు మళ్లాడు. అయితే, వేరే దారిలో ప్రయాణం సాగించాడు. ఎడారి కావడంతో రోడ్డు అంతా ఎగుడుదిగుడుగా ఉంది. ఇంతలో కారు అదుపు తప్పింది. ఓ భారీ రాయిని ఢీకొని ఆగిపోయింది. ఎటు చూసినా ఇసుకే. ఇంకెవరైనా అయితే బతుకుపై ఆశలు వదిలేసుకునేవారు. ఎమిలీ మొండోడు. కారులో చూశాడు. ఎడారి ప్రయాణమని.. ఏం దొరకదని తెలిసి.. తాను ముందుగానే కొనుగోలు చేసిన ఆహారం, నీళ్లు ఉన్నాయి. డిక్కీలో టూల్‌కిట్, రంపపు బ్లేడు ఉన్నాడు. అంతే.. బుర్రలో బల్బు వెలిగింది.
ఈ డొక్కు కారునే మోటార్ సైకిల్‌గా మార్చేయాలనుకున్నాడు. ముందు కారు బాడీని తొలగించాడు. దాన్నే టెంటులా వాడుకుని.. దాని కిందనే పడుకున్నాడు. ఎక్కువ రోజులు వచ్చేందుకు వీలుగా ఆహారం, నీళ్లు కొంచెం కొంచెం మాత్రమే తీసుకోవడం మొదలెట్టాడు. ఇక బైక్ తయారీ కోసం కారు చాసిస్‌ను చిన్న సైజులోకి మార్చాడు. ఇంజిన్, గేర్‌బాక్సును బైక్ మధ్య భాగంలో అమర్చాడు. కారు బంపర్‌ను సీటులా మార్చాడు. మొత్తమ్మీద 12 రోజుల్లో బైక్‌ను తయారుచేసేశాడు. అప్పటికే అతడు తెచ్చుకున్న ఆహారం పూర్తిగా అయిపోయింది. కేవలం అరలీటరు నీళ్లు మిగిలాయి. ఆ బైక్‌పై ఒకరోజు ప్రయాణించిన తర్వాత.. దారిలో అతడికి మొరాకో పోలీసులు కనిపించారు.
వారే అతడిని సమీప గ్రామానికి తరలించారు. ఇక్కడ ఆశ్చర్యం ఏంటంటే... ? ఎమిలీ వద్ద కారుకు సంబంధించిన పత్రాలే ఉన్నాయని.. ఈ ‘బైక్’కు సంబంధించిన పత్రాలు లేవంటూ పోలీసులు అతడికి జరిమానా కూడా విధించారు. ఎమిలీ సాహసయాత్ర గురించి అప్పట్లో స్థానిక పత్రికల్లో వచ్చినా.. పెద్దగా ప్రాచుర్యంలోకి రాలేదు. ఇటీవల ఇంటర్నెట్ సైట్లలోనూ.. మీడియాలోనూ మళ్లీ ఈ విషయం రావడంతో అతడి పేరు మార్మోగిపోతోంది. ప్రస్తుతం ఎమిలీ(63) దక్షిణ ఫ్రాన్స్‌లో నివాసముంటున్నాడు. ఆ ‘కారు బైక్’ ఇప్పటికీ ఆయన వద్ద ఉంది. మొత్తం విషయం చదివిన తర్వాత మీరు కూడా ఇదే మాట అనుకుంటున్నారు కదా ?
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more