Ys jagan appeal

ys jagan appeal

ys jagan appeal

8.gif

Posted: 07/11/2012 01:29 PM IST
Ys jagan appeal

     రాష్ట్రపతి ఎన్నికల్లో హైదరాబాద్ లో ఓటు వేసేందుకు అనుమతించాలంటూ కేంద్ర ఎన్నికల సంఘానికి వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. చంచల్ గూడా జైల్లో ఉన్న జగన్ ఈ నెల 19న జరుగనున్న రాష్ట్రపతి ఎన్నికల్లో హైదరాబాద్లో ఓటు హక్కును వినియోగించుకునేందుకు అనుమతించాలంటూ కేంద్ర ఎన్నికల సంఘాన్ని కోరారు. రాష్ట్రపతి ఎన్నికల పోలింగ్ రోజు తాను ఢిల్లీకి వచ్చే పరిస్థితి లేనందున హైదరాబాద్ పోలింగ్ కేంద్రంలో ఓటు హక్కు వినియోగించుకోవటానికి అనుమతించాలని వైఎస్ జగన్మోహన్ రెడ్డి jaganకేంద్ర ఎన్నికల సంఘానికి లేఖ రాశారు. ఆస్తుల కేసులో రిమాండ్ ఖైదీగా చంచల్ గూడలో జైలులో ఉన్న జగన్, జైలరు సమక్షంలో లేఖపై సంతకం చేశారు. ఈసీ అనుమతిస్తే రాష్ట్రపతి ఎన్నికల్లో తన ఓటును హైదరాబాద్ పోలింగ్ కేంద్రంలో తగిన ధ్రువీకరణ పత్రాలు చూపించి వేస్తానని ఆ లేఖలో పేర్కొన్నారు. జగన్ ఓటు వేసేందుకు ఇక్కడ ఏర్పాట్లు చేస్తే ఆయన ఓటు వేసే అవకాశం ఉంది. ఇదిలా ఉండగా, రాష్ట్రపతి ఎన్నికల్లో ఓటుపై అధికారాన్ని జగన్ కు కట్టబెడుతూ ఇప్పటికే వైఎస్సార్ కాంగ్రెస్  పార్టీ కేంద్ర పాలకమండలి తీర్మానం చేసింది. పార్టీ తీర్మానం ఆధారంగా సోమవారం జైల్లో జగన్ ను వైఎస్ విజయమ్మ కలిశారు. జగన్  నిర్ణయంపై రాజకీయ వ్యవహారాల కమిటీ సమావేశంలో చర్చించి ఓ అభిప్రాయానికి రావొచ్చని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. రాష్ట్రపతి ఎన్నికల్లో మద్దతివ్వాలని యూపీఏ అభ్యర్ధి ప్రణబ్  ముఖర్జీ, ఎన్డీఏ అభ్యర్ధి సంగ్మా విజయమ్మకు విజ్ఞప్తి చేసిన నేపథ్యంలో పార్టీ నిర్ణయంపై ఉత్కంఠ నెలకొంది. దీనిపై పూర్తి స్పష్టత ఈ సాయంత్రానికి వచ్చే అవకాశం కనిపిస్తోంది.

...avnk

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Gali janardhan reddy bail issue
Tdp to clarify stand on telangana  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles