No fly list man stranded in bahrain returns to us

No-fly list man stranded in Bahrain returns to US

No-fly list man stranded in Bahrain returns to US

fly.gif

Posted: 07/12/2012 06:48 PM IST
No fly list man stranded in bahrain returns to us

No-fly list man stranded in Bahrain returns to US

మీరెక్కిన విమానంలో పైలట్ లేకుంటే ఎలా ఉంటుంది? అదెలా సాధ్యమంటారా! బ్రిటన్ గగనతలంలో ప్రస్తుతం ఓ విమానం ఇలాగే తరచూ ఎగురుతోంది మరి. పైలట్ లేకుండానే ఎగరడం, దిగడం, వాతావరణానికి తగినట్లు వ్యవహరించడం, ఎదురుగా వచ్చే వాటిని ఢీ కొట్టకుండా జాగ్రత్తలు తీసుకోవడం.. ఒకటేమిటి ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనేలా ఈ రోబోట్ విమానాన్ని బ్రిటిష్ ఇంజనీర్లు అభివృద్ధి పరిచారు. భవిష్యత్తులో మనమంతా ఇలాంటి విమానాల్లోనే ప్రయాణిస్తామంటూ వారు ధీమా వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం ప్రయోగాత్మక దశలో ఉన్న ఈ విమానాన్ని రక్షణ అవసరాల కోసం వినియోగించాలని బ్రిటిష్ ఏరోస్పేస్(బీఏఈ) అధికారులు భావిస్తున్నారు.  అయితే ప్రయాణి కులను తరలించడానికి కూడా పౌర విమానాలను అభివృద్ధి పరచనున్నట్లు తెలిపారు. ఇది ప్రస్తుతం అందుబాటులో ఉన్న ఆటోపైలట్ వ్యవస్థకు ఎన్నో రెట్లు మెరుగైనదని పేర్కొన్నారు. 'కాక్‌పిట్‌లో ఉన్న కెమెరాల సాయంతో భూమి నుంచి కంప్యూటర్ వ్యవస్థ ద్వారా నిపుణులు ఈ విమానాల ప్రయాణాన్ని, పనితీరును ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ ఉంటారు. ఏదైనా అవాంతరాలు ఎదురైతే రోబో పైలట్ సమాచారం పంపుతుంది. దానిపై నిపుణుల సూచనలమేరకు విమానాన్ని నడుపుతుంది.

ఒకవేళ ఈ సమాచార వ్యవస్థ పనిచేయకపోతే రోబో పైలటే తగిన నిర్ణయం తీసుకుంటుంద'ని బీఏఈ ఇంజనీర్లు వివరించారు. ఏదైనా సమస్య వల్ల అత్యవసరంగా దిగాల్సి వచ్చినప్పుడు భూమిపై అనువైన ప్రాంతాన్ని గుర్తించడం, భూమిపై ఏ జీవికీ ప్రాణ నష్టం వాటిల్లకుండా చూడటం వంటి జాగ్రత్తలు కూడా రోబో పైలట్ తీసుకుంటుందట! 'పైలట్లు ఎక్కువకాలం ఏకాగ్రతతో విమానాన్ని నడపలేరు. కానీ రోబో పైలట్ ఎన్నిరోజులైనా ఏకధాటిగా పనిచేయగలదు. పైలట్ రహిత విమానాలు అందుబాటులోకి రావడానికి ఇక ఎంతో కాలం పట్టదు. వీటిపై ప్రయోగాలు విజయవంతంగా కొనసాగుతున్నాయ'ని పరిశోధకులు వివరించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  67 pilgrims dead during 2 weeks of amarnath yatra
Chiru cabinet minister post conform  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles