రాష్ట్రంలో ప్రస్తుతం 'పవర్' పెద్ద సమస్యగా మారిందని, 'పవర్' లేకుండా ఏమీ చేయలేని పరిస్థితి నెలకొందని ముఖ్యమంత్రి ఎన్ కిరణ్ కుమార్ రెడ్డి వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో తీవ్రస్థాయిలో విద్యుత్ కొరత, రాజకీయ అస్థిరత నెలకొన్న నేపథ్యంలో ముఖ్యమంత్రి చేసిన 'పవర్' వ్యాఖ్య ప్రాధాన్యం సంతరించుకుంది. ఆంధ్రప్రదేశ్ వాణిజ్య, పారిశ్రామిక మండళ్ల సమాఖ్య (ఫ్యాప్సీ) 'ఎక్సలెన్స్ అవార్డు'ల బహుకరణకార్యక్రమంలో సిఎం పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రస్తుతం మన రాష్ట్రంలోనే కాకుండా అంతటా ఇబ్బందికరమైన పరిస్థితులే ఉన్నాయని, ఈ ఇబ్బందులు కొంత కాలమే ఉంటాయని తరువాత ఆనందకరమైన రోజులు వస్తాయని అన్నారు. గ్యాస్ సరఫరా తగ్గడంతోపాటు ప్రాజెక్టుల్లో తగినంతగా నీళ్లు లేక విద్యుత్ కొరత పరిస్థితి ఏర్పడిందని, త్వరలోనే ఈ సమస్యను అధిగమిస్తామన్న ఆశాభావం వ్యక్తం చేశారు.
వర్షాభావం వల్ల జల విద్యుదుత్పత్తి గణనీయంగా తగ్గిందని, శ్రీశైలంలోని జల విద్యుత్ ప్రాజెక్టు నుంచి ఒక్క యూనిట్ విద్యుత్ కూడా రాని పరిస్థితి నెలకొందన్నారు. ఫలితంగానే విద్యుత్ ఉత్పత్తి, వినియోగం మధ్య గణనీయమైన వ్యత్యా సం ఏర్పడుతోందన్నారు. విద్యుత్ సమస్య స్వల్పకాలమే ఉంటుందని, దీర్ఘకాలంలో ఇలాంటి పరిస్థితిరాకుండా తగిన ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని పారిశ్రామివేత్తలకు సిఎం హామీ ఇచ్చారు. ఉత్తర, ఈశాన్య ప్రాంతాల నుంచి విద్యుత్‌ను కొనుగోలు చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉన్నా.. దానిని దక్షిణాదికి సరఫరా చేయడానికి తగిన ట్రాన్స్‌మిషన్ వ్యవస్థ లేదన్నారు. రాష్ట్రంలో నెలకొన్న విద్యుత్ ఇబ్బందుల గురించి తాను ఇప్పటికే ప్రధాని దృష్టికి తీసుకువెళ్లినట్టు చెప్పారు. ప్రస్తుతానికి వర్షాలు ఆశాజనకంగానే ఉన్నాయని, ఇటీవల కురిసిన వర్షాల వల్ల లోటు తగ్గిందన్నారు. రాష్ట్రం లో వర్షం కురవడం వల్ల రైతులకు మాత్రమే లాభం జరుగుతుందని, ఎగువ రాష్ట్రాలైన మహారాష్ట్ర, కర్ణాటకలో వర్షాలు కురిస్తే మన ప్రాజెక్టుల్లోకి నీళ్లు వచ్చి విద్యుత్ సమస్య తీరే అవకాశం ఉందన్నారు. ఈ రెండు రాష్ట్రాల్లో కూడా వర్షాలు బాగా కురవాలని దేవున్ని వేడుకునే పరిస్థితి ఉందని ముఖ్యమంత్రి వ్యాఖ్యానించారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more