ఫేస్బుక్ క్రేజు అనుకున్నంత లేదా? అకౌంట్లలో నకిలీవి కూడా ఉన్నాయా? ప్రపంచంలో అతిపెద్ద సోషల్ నెట్వర్కింగ్ సైట్‌గా ఖ్యాతి గడించిన ఫేస్బుక్ స్వయంగా ఈ విషయాన్ని వెల్లడించింది. ఫేస్‌బుక్‌కు ప్రపంచవ్యాప్తంగా 95.5 కోట్ల మంది యూజర్లు ఉన్నారు. ఇందులోప దాదాపు పదిశాతం అంటే 8.3 కోట్ల అకౌంట్లు నకిలీవి లేదా డూప్లికేట్‌వని అమెరికన్ స్టాక్ మార్కెట్ల రెగ్యులేటర్ సెక్యూరిటీస్ ఎక్స్ఛేంజ్ కమిషన్ ప్రకటించింది. మొత్తం అకౌంట్లలో 4.8 శాతం డూప్లికేట్ అకౌంట్లని, అదనపు అకౌంట్ కింద యూజర్లు వీటిని ఉపయోగిస్తుంటారని తెలిపింది. వీటితోప పాటు నకిలీ అకౌంట్లు కూడా ఉన్నాయని, ప్రత్యేక వ్యాపకం లేదా వ్యాపారం కోసం నకిలీ అకౌంట్లను కొంతమంది సృష్టిస్తుంటారని ఫేస్బుక్ సదరు ప్రకటనలో తెలిపింది. వీటిని స్పామ్ అకౌంట్లుగా భావిస్తామని ఈ సంస్థ స్పష్టం చేసింది. జూన్ 30 నాటికి మొత్తం యూజర్లలో నకిలీ అకౌంట్లు 2.4 శాతం ఉన్నాయి. అభివృద్ధి చెందిన దేశాల్లో నకిలీ అకౌంట్ల సంఖ్య తక్కువ కాగా ఇండోనేషియా, టర్కీ వంటి దేశాల్లో ఈ తరహా అకౌంట్లు ఎక్కువగా ఉన్నట్లు ఫేస్బుక్ ప్రకటించింది. రెండో త్రైమాసికంలో బ్రెజిల్, ఇండియా, ఇండోనేషియాలలో ఫేస్బుక్ ప్రాచుర్యం పెరిగిపోయిందని, మెరుగైన వృద్ధిరేటుకు ఈ మార్కెట్లే కారణమని వివరించింది. మొబైల్స్‌లో ఫేస్బుక్ వినియోగం పెరిగిన తర్వాత క్రేజు మరింత పెరిగింది. రోజూ యాక్టివ్‌గా ఉండే యూజర్లు బ్రెజిల్ , అమెరికా, ఇండియాలలో ఎక్కువ.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more