Nandamuri taraka ratna secret marriage at sanghi temple

Nandamuri Taraka Ratna secret marriage at Sanghi Temple,nandamuritarakaramaraofamily, nandamuri tarakaratna marriage, tarakaratnamarriagesanghitemple, secretsmarriage, filmstarsmarriage, filmstarsecretsmarriage, secondsmarriage,Nandamuri Tarakaratna secret Wedding, Tarakaratna Secret Wedding with Alekhya Reddy, Nandamuri Tarakaratna Secret Wedding with Madhavreddy Daughter in Law Alekhya Reddy, Nandamuri Tarakaratna Secret Wedding at Sanghi Temple

Nandamuri Taraka Ratna secret marriage at Sanghi Temple

Nandamuri.gif

Posted: 08/04/2012 10:47 AM IST
Nandamuri taraka ratna secret marriage at sanghi temple

Nandamuri Tarakaratna secret Wedding

ఇప్పటి వరకు  నందమూరి వంశంలో  బాలయ్య కూతురి పెళ్లి, జూనియర్ ఎన్టీఆర్ పెళ్లి  ఎంతో ఘనంగా జరిగిన విషయం తెలిసిందే. అయితే  నందమూరి వంశంలో పుట్టి  నటుడిగా   ఉన్న   తారకరత్న ప్రేమ పెళ్లి చేస్తుకున్నట్లు తెలుస్తోంది.  నందమూరి కుటుంబానికి చెందిన సినీ నటుడు తారకరత్న రహస్యంగా పెళ్లి చేసుకున్నారు. హైదరాబాద్ శివార్లలోని సంఘీ టెంపుల్‌లో గురువారం రాత్రి.. అలేఖ్య రెడ్డిని వివాహమాడారు. మహానటుడు ఎన్టీ రామారావు నాలుగో కుమారుడైన మోహన కృష్ణ తనయుడే.. తారకరత్న. ఇక, వధువు అలేఖ్య.. మాజీ హోం మంత్రి ఎలిమినేటి మాధవరెడ్డి మాజీ కోడలు. దాదాపు ఏడాదిన్నరగా తారకరత్న నందమూరి కుటుంబం నుంచి బయటికి వచ్చేసి విడిగా ఉంటున్నారు. అప్పట్నుంచీ వీరిరువురూ సహజీవనం చేస్తున్నారు. ఇటీవలే విడుదలైన 'నందీశ్వరుడు' సినిమాకు అలేఖ్య తారకరత్న వ్యక్తిగత కాస్ట్యూమ్ డిజైనర్‌గా వ్యవహరించారు. ఈ పెళ్లికి వధువు తల్లి, వరుడి సన్నిహితులు నలుగురైదురు మాత్రమే హాజరయ్యారు. నందమూరి కుటుంబసభ్యుల్లో ఎవరికీ ఈ వివాహం ఇష్టం లేదని సమాచారం. కాగా.. తమ వివాహం గురించి త్వరలోనే చిత్రపరిశ్రమలో వారందరికీ చెప్పి రిసెప్షన్ ఏర్పాటు చేసే ఆలోచనలో తారకరత్న ఉన్నారు. ఒకే రోజు తొమ్మిది చిత్రాలకు సంతకం చేసి ఘనంగా తెరంగేట్రం చేసిన తారకరత్న కెరీర్‌లో సరైన హిట్ దక్కించుకోలేకపోయారు. ఆయన నటించిన ఒకటో నెంబర్ కుర్రాడు చిత్రం ఫర్వాలేదనిపించగా.. యువరత్న, భద్రాద్రి రాముడు, నందీశ్వరుడు తదితర చిత్రాలు బాక్సాఫీసు వద్ద విఫలమయ్యాయి. అమరావతి చిత్రంలో నటనకుగాను 'ఉత్తమ ప్రతినాయకుడు'గా తారకరత్న నంది పురస్కారాన్ని పొందారు.

Nandamuri Taraka Ratna secret marriage at Sanghi Temple

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Marriage and women over 52
Another medal to bharath  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles