Tatas propose rs 500 cr aerospace hub in andhra

Tatas propose Rs 500 cr aerospace hub in Andhra

Tatas propose Rs 500 cr aerospace hub in Andhra

aerospace.gif

Posted: 08/04/2012 11:32 AM IST
Tatas propose rs 500 cr aerospace hub in andhra

Tatas propose Rs 500 cr aerospace hub in Andhra

ఏరోస్పేస్ హబ్‌గా ఆంధ్రప్రదేశ్ అవతరిస్తోందని ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి అన్నారు. హైదరాబాద్ సమీపంలోని ఆదిభట్లలో ఏర్పాటు చేసిన ఏరోస్పేస్ సెజ్‌లో అతి కొద్ది కాలంలోనే టాటా అడ్వాన్స్‌డ్ సిస్టమ్స్ మూడు కంపెనీలను ఏర్పాటు చేసిందని ఆయన తెలిపారు. టాటాలను ఆదర్శంగా తీసుకుని మరికొన్ని కంపెనీలు ఇక్కడకు తరలివస్తాయని ఆశిస్తున్నట్లు ముఖ్యమంత్రి చెప్పారు. శుక్రవారం నాడిక్కడ టాటా అడ్వాన్స్‌డ్ సిస్టమ్స్, లాకీడ్ మార్టిన్ భాగస్వామ్య సంస్థ టాటా లాకీడ్ మార్టిన్స్ ఏరోస్ట్రక్చర్స్ దేశీయంగా అభివృద్ధి చేసిన తొలి సి-130 సెంటర్ వింగ్ బాక్స్‌ను ముఖ్యమంత్రి సమక్షంలో టాటా లాకీడ్ మార్జిన్ చైర్మన్ ఎస్ రామదొరై, లాకీడ్‌వైస్ ప్రెసిడెంట్ జార్జ్ షుల్జ్‌కు అందించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ.. ఏరోస్పేస్ రంగంలో అపార అవకాశాలున్నాయని, ఈ రంగంలోకి మరిన్ని పెట్టుబడులను ఆకట్టుకునేందుకు గాను అవసరమైన చర్యలు చేపట్టనున్నట్లు తెలిపారు.

పారిశ్రామిక రంగానికి ప్రోత్సాహానిచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని రకాలైన చర్యలు తీసుకుంటుందని అన్నారు. ఇప్పటికే ప్రైవేట్ రంగం నుంచి 1.30 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడుల ప్రతిపాదనలు రాగా ప్రభుత్వ రంగ సంస్థలు 1.25 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు పెట్టడానికి సుముఖంగా ఉన్నాయని ఆయన వివరించారు. ఇందులో 15 యూ నిట్లు ఉత్పత్తిని ప్రారంభించటంతో 25 వేల మందికి ఉపాధి లభించిందని ముఖ్యమంత్రి తెలిపారు. మొత్తం యూనిట్లన్ని అందుబాటులోకి వస్తే మరో 65 వేల ఉద్యోగాలు వస్తాయని అన్నారు. స్థానికంగా ఏర్పాటు చేస్తున్న పరిశ్రమల్లో స్థానికులకు ఉపాధి కల్పించాలని ముఖ్యమంత్రి పారిశ్రామిక రంగాన్ని కోరారు. పరిశ్రమల ఏర్పాటు కోసం ప్రజల నుంచి అవసరమైన భూమిని సేకరిస్తున్నామని, ఇందుకు ప్రతిఫలంగా వారికి ఆయా సంస్థల్లో ఉపాధి అవకాశాలను కల్పించితే బాగుంటుందని ఆయన సూచించారు.

 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Loss of rs100 note causes four deaths in uttar pradesh village
Zhang zhao win all chinese mixed doubles final  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles