First austronat neal arm strong dead

first austronat neal arm strong dead

first austronat neal arm strong dead

47.gif

Posted: 08/26/2012 08:27 PM IST
First austronat neal arm strong dead

       arm_1చంద్రుడిపై తొలి అడుగు మోపిన అమెరిగా వ్యోమగామి నీల్ ఆర్మ్‌స్ట్రాంగ్ కన్నుమూశారు. ఇతని వయస్సు 82 సంవత్సరాలు. హృదయ సంబంధమైన సమస్యలతో ఆయన చనిపోయినట్లు కుటుంబ సభ్యులు ఒక ప్రకటనలో తెలిపారు. ఆగస్టు 5న జరిగిన బైపాస్ సర్జరీ అనంతరం తలెత్తిన సమస్యలే మరణానికి దారి తీసినట్లుగా నీల్ ఆర్మ్‌స్ట్రాంగ్ కుటుంబ సభ్యులు పేర్కొన్నారు. అయితే ఆయన ఎక్కడ తుది శ్వాస విడిచారో తెలియరాలేదు. కాగా, నీల్ ఆర్మ్‌స్ట్రాంగ్ 1930 ఆగస్టు 5న అమెరికాలోని ఓహియో రాష్ట్రంలో జన్మించారు. ఆరవ ఏటనే తొలిసారిగా విమానంలో ప్రయాణించారు. 1969 జూలై 20న చందమామపై దిగిన arm_2అపోలో 11 వ్యోమనౌక సారథి నీల్ ఆర్మ్‌స్ట్రాంగ్. 20వ శతాబ్దపు శాస్త్రవిజ్ఞానపరమైన సాహస యాత్రలలో అత్యంత ప్రముఖమైనది ఈ యాత్ర. చంద్రుడిపై కాలు మోపిన అనంతరం ఒక మనిషికి ఇది చిన్న అడుగే కానీ, మానవాళికి భారీ ముందంజ అని నీల్ ఆర్మ్‌స్ట్రాంగ్ అప్పుడు అన్నారు. అప్పుడు చంద్రమండల యాత్రకు వెళ్లి వారిలో నీల్ ఆర్మ్‌స్ట్రాంగ్‌తో పాటు ఎడ్విన్ ఆల్డ్రిన్, మైకేల్ కాలిన్స్ ఉన్నారు. ప్రయోగాల నిమిత్తం వారు నమూనాలు సేకరించారు. చంద్రునిపై కాలుమోపిన ఈ క్షణాలను సుమారు 50 కోట్ల మంది టీవిలలో చూశారట. నీల్ ఆర్మ్‌స్ట్రాంగ్ తన పదహారవ ఏటనే పైలట్ లైసెన్స్ పొందారు. అయితే అప్పటికి ఆయనకు ఇంకా డ్రైవింగ్ లైసెన్స్ కూడా రాలేదట.

...avnk

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Strong earthquake shakes eastern indonesia
Under 19 world cub wins india  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles