గాంధీ గారు పుట్టి తేదీ తెలుసు? అలాగే గౌతమ బుద్దుడు పుట్టిన తేదీ తెలుసు? చంద్రమండలం ఎంత దూరమో కూడా మనం చెప్పగలం. కానీ రాముడు పుట్టిన తేదీ ఎవరికైన తెలుసా? ఆయన పుట్టిన రోజు ఎప్పుడు వస్తుంది? ఏ నెలలో వస్తుంది. అనేక ప్రశ్నలు అందరికి వస్తాయి. రాముడు పెళ్లి రోజు జరుపుకుంటాం గానీ .. రాముడు పుట్టిన రోజు ఎందుకు చేసుకోం? అంటే ఆ రోజు మనకు తెలియాదు కాబట్టి. ఇక నుండి ఆ భయం లేదు మనకు రాముడు ఎప్పుడు పుట్టిందో తెలిసిపోయింది. రామాయణం నిజజీవిత కథా? వాల్మీకి కల్పనా? అది ఒట్టి కావ్యమేనా? చారిత్రక గాథా? రాముడు దేవుడా? మానవమాత్రుడేనా? లేక రామాయణకావ్యంలో పాత్ర మాత్రమేనా? ..నాస్తికులకు, అప్పుడప్పుడూ ఆస్తికులకూ వచ్చే సందేహాలివి! కానీ, రామాయణం నిజంగా జరిగిందని.. రాముడు భరతభూమిపై జన్మించాడని.. అయోధ్యా పురవీధుల్లో నడయాడాడని.. ఇన్‌స్టిట్యూట్ ఫర్ సైంటిఫిక్ రిసెర్చ్ ఆన్ వేదాస్ (ఐ-సర్వ్) పరిశోధకులు ఢంకా బజాయించి మరీ చెబుతున్నారు.
"రాముడు జన్మించినప్పుడు ఐదు గ్రహాలు ఉచ్ఛదశలో ఉన్నాయి. చైత్రమాసం, శుక్లపక్షం, నవమినాడు అభిజిల్లగ్నంలో శ్రీరామ చంద్రుడు జన్మించాడు. ఆయన జాతకంలో ఐదుగ్రహాలు ఉచ్ఛలో ఉన్నాయి. వనవాసానికి వెళ్లేటప్పటికి రాముడి వయసు 25 సంవత్సరాలు'' అంటూ రామాయణంలో వాల్మీకి చెప్పిన వివరాల ఆధారంగా వారు తమ పరిశోధన మొదలుపెట్టారు. ప్లానిటేరియం అనే సాఫ్టవేర్ ద్వారా వర్తమాన కాలం నుంచి ఒక్కొక్కరోజే వెనక్కి వెళుతూ, గ్రహగతులను, స్థితులను లెక్కగడుతూ రాముడి పుట్టిన రోజును నిర్ధారించారు. వారి సాఫ్ట్‌వేర్ ప్రకారం రాముడి జనన తేదీ... క్రీ.పూ.5114, జనవరి 10. ఇదే పద్ధతిలో.. క్రీస్తుకు పూర్వం జరిగిన అనేక కీలక ఘటనల తేదీలను వారు లెక్కించారు.
నిజమేనా?
రాముడి పుట్టినరోజును జనవరి 10గా నిర్ధారించడంపై పలు సందేహాలున్నాయి. ఎందుకంటే.. జనవరి నెలలో చైత్రమాసం రాదని పలువురు సిద్ధాంతులు చెబుతున్నారు. మరికొందరు మాత్రం.. అధికమాసాల లెక్క సరిచేసుకుంటూ వెళ్తే త్రేతాయుగంలో చైత్రమాసం జనవరిలో వచ్చే అవకాశం ఉందని చెబుతున్నారు.కానీ, అధికమాసాల లెక్క వేసేదే అదనంగా ఉన్న రోజులను సంవత్సరంలో కలపడానికి కాబట్టి ఎట్టిపరిస్థితుల్లోనూ జనవరిలో చైత్రమాసం రాదు అని బల్లగుద్ది చెబుతున్నారు. ఇవన్నీ పక్కన పెడితే.. పురాణగాథల ప్రకారం కృతయుగం కాలవ్యవధి 17,28,000 సంవత్సరాలు. త్రేతాయుగం.. 12,96,000, ద్వాపరయుగం.. 8,64,000, కలియుగం.. 4,32,000 సంవత్సరాలు. ప్రస్తుతం కలియుగంలో 5,106 సంవత్సరాలు జరిగాయని పండితుల లెక్క. ఈ లెక్కన కలియుగ ప్రారంభానికి దాదాపు రెండువేల సంవత్సరాల ముందు మాత్రమే రాముడు పుట్టి ఉండాలి. అంటే మధ్యలో ద్వాపరయుగం లెక్క మారుతుంది. ఇది పురాణాలు చెప్పే కాలమానానికి విరుద్ధం. ఈ సందేహాలన్నిటికీ ఐ-సర్వ్ పరిశోధకులే సమాధానం చెప్పాలి మరి!!
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more