Mammus family ready to do duty of hanging ajmal kasab

Mammus family ready to do duty of hanging Ajmal Kasab,ak terrorist Kasab, Hang, meerut, central jail, Mammusingh, hangman,Indira Gandhi, Bhagath singh

Mammu's family ready to do 'duty' of hanging Ajmal Kasab

Mammu.gif

Posted: 08/31/2012 11:29 AM IST
Mammus family ready to do duty of hanging ajmal kasab

Mammu's family ready to do 'duty' of hanging Ajmal Kasab

దేశ ఆర్థిక రాజధాని ముంబై మహానగరంలో రక్తవర్షం కురిపించిన పాకిస్థానీ ఉగ్రవాది అజ్మల్ కసబ్‌కు ఉరే సరి అని సుప్రీంకోర్టు తేల్చి చెప్పింది. ఇక.. అతడిని ఉరితీసేదెవరు.. ఆ శిక్షను అమలుచేసేదెవరన్న అనుమానం తలెత్తింది. దేశంలో తలారులెవరూ సజీవంగా లేకపోవడంతో.. అసలు శిక్ష అమలు సాధ్యమేనా అనుకున్నారు. ఎందుకంటే ప్రస్తుతం కేంద్ర కారాగారాల్లో తలారి పోస్టులన్నీ ఖాళీగా ఉన్నాయి. దేశవ్యాప్తంగా ఒక్క తలారి కూడా సజీవంగా లేరు. దేశంలో ఆఖరిసారి 2004లో కోల్‌కతాలో ధనుంజయ్ చటర్జీని ఉరి తీశారు. చటర్జీని ఉరి తీసిన నాటా ముల్లిక్ 2009లో చనిపోయాడు. సరిగ్గా ఇలాంటి సమయంలో కసబ్‌ను ఉరి తీసేందుకు నేనున్నానంటూ ముందుకొచ్చాడో వ్యక్తి. అతనెవరో కాదు.. బ్రిటిష్ హయాంలో సాక్షాత్తు సర్దార్ భగత్‌సింగ్‌ను ఉరితీసిన రామ్‌రఖా మునిమనవడు.. పవన్ జలాద్. ఈయన తండ్రి మమ్మూ జలాద్ కూడా ఉరి తీయడంలో ఆరితేరినవాడు. ఢిల్లీ జైళ్లలో దాదాపు 47 ఏళ్ల పాటు తలారిగా సేవలు అందించాడు.

ఇందిరాగాంధీ హంతకులు సహా 12 మందికి ఉరిశిక్షలు అమలుచేశాడు. 2011లో మమ్మూ చనిపోయాడు. కసబ్‌ను ఉరితీయాలన్నది మమ్మూ చివరి కోరిక. తన తండ్రి చేయలేని పనిని.. తాను చేస్తానని పవన్ జలాద్ చెబుతున్నాడు.అంతేకాదు.. కసబ్‌ను బహిరంగంగా ఉరితీయాలని డిమాండ్ చేశాడు. ఇక మహారాష్ట్రలో చిట్ట చివరి తలారి 1996లో రిటైరయ్యారు. కానీ, అసలు ఉరి తీయాలంటే తలారే ఎందుకు.. ఓ సాధారణ కానిస్టేబుల్ అయినా సరిపోతాడని చెబుతున్నారో మహిళా డీఐజీ. అంతేకాదు.. ఎవరూ ముందుకు రాకపోతే తానే ఆ పని పూర్తిచేస్తానని కూడా కుండ బద్దలుకొట్టారు!! ఆమె ఎవరో కాదు... ప్రస్తుతం కసబ్‌ను నిర్బంధించిన ఆర్థర్ రోడ్ జైలు సూపరింటెండెంట్ స్వాతి సాథే. ఉరితీయడానికి తలారి అవసరమన్నది అపోహ మాత్రమేనని, జైలు మాన్యువల్ ప్రకారం చివరి అంకం సూపరింటెండెంట్ చేతుల మీదుగానే పూర్తవుతుందని స్పష్టం చేశారు.మహారాష్ట్రలో ఉరితీతను పుణెలోని ఎరవాడ, నాగ్‌పూర్ సెంట్రల్ జైళ్లలో మాత్రమే అమలు చేస్తున్నారు. కాబట్టి కసబ్‌ను కట్టుదిట్టమైన భద్రత నడుమ వీటిలో ఏదో ఒక జైలుకు బదిలీ చేసి, ఉరికంబం ఎక్కించాల్సి ఉంటుంది. ఉరితాడును బీహార్‌లోని బక్సర్ జైలులోనే తయారుచేస్తారు. ఇవీ సంగతులు..!

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  101 year old driver hits 11 people in los angeles
Narendra modi attack for comment on women  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles