P chidambaram worships at tirumala temple

P Chidambaram worships at Tirumala temple,Union Finance Minister, P Chidambaram, worship, famous, hill, shrine, Lord, Venkateswara, Tirumala, Chidambaram, wife, Nalini, son, Karti Chidambaram, daughter-in-law Srinidhi Karti, members.

P Chidambaram worships at Tirumala temple

Chidambaram.gif

Posted: 08/31/2012 04:29 PM IST
P chidambaram worships at tirumala temple

P Chidambaram worships at Tirumala temple

కేంద్ర ఆర్థికమంత్రి పి.చిదంబరం కోడలు డాక్టర్ శ్రీనిధి కార్తి చిదంబరం తిరుమలలో భరతనాట్య ప్రదర్శనతో భక్తులను అబ్బురపరిచారు. చిదంబరం కుటుంబ సభ్యులందరితో కలిసి తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా సాయంత్రం 6 గంటల నుంచి 7 గంటల వరకు ఆలయం వద్ద నాదనీరాజన వేదికపై.. చిదంబరం కోడలు శ్రీనిధి కార్తి తన నాట్యాభినయంతో భక్తులను అలరింప చేశారు. పుష్పాంజలి అనే అంశంలో శ్రీమన్నారాయణ, అదివో అల్లదివో, వర్ణంలోని త్యాగరాజ స్వామి కృతులైన ‘నగుమోము గనలేని, ఏటీ జన్మము, బాలకనక, కనుగొంటిని, నన్నువిడిచి’ అన్న అంశాలకు ఆమె లయబద్ధంగా అభినయం చేశారు. అన్నమయ్య కీర్తనలోని ‘ఎంత మాత్రమున ఎవ్వరి దలచిన’, చివరిలో తమిళ సంకీర్తనలోని ‘శిలాప్పాదికారం’ అన్న అంశంలో కూర్మావతారం ఘట్టాలను శ్రీనిధి కార్తి కళ్లకు కట్టినట్టుగా నృత్యం చేశారు.

P Chidambaram worships at Tirumala temple

ఈ కార్యక్రమాన్ని చిదంబరంతో పాటు ఆయన కుటుంబ సభ్యులు తిలకించారు. అంతకుముందు.. చిదంబరం, ఆయన సతీమణి, కుమారుడు, కోడలు, ఇద్దరు మనుమరాళ్లతో కలిసి వైకుంఠం క్యూకాంప్లెక్స్ ద్వారా ఆలయానికి చేరుకున్నారు. ముందుగా ధ్వజస్తంభానికి మొక్కుకుని స్వామివారిని దర్శించుకున్నారు. అనంతరం వకుళమాతను దర్శించుకుని హుండీలో కానుకలు సమర్పించారు. దేశం అంతటా వర్షాలు కురిసి సుభిక్షంగా ఉండాలని, అందరూ సుఖశాంతులతో ఉండాలని శ్రీవెంకటేశ్వరస్వామిని ప్రార్థించినట్లు చిదంబరం తెలిపారు. టీటీడీ చైర్మన్ బాపిరాజు, ఈవో ఎల్.వి.సుబ్రహ్మణ్యం తదితరులు లడ్డూ ప్రసాదాలు, శ్రీవారి చిత్రపటంను చిదంబరానికి అందజేశారు. దానికిముందు చిదంబరం తన మనుమరాలికి గుండు కొట్టించి తలనీలాల మొక్కు సమర్పించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  12 decapitated heads of pakistani soldiers
Aditi mukherji first winner award  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles