Akistan foreign minister hina rabbani khar

We have taken bold steps to normalise ties with India: Pak,Hina, German, Minister, express, satisfaction, over defence, ties, india,

We have taken bold steps to normalise ties with India: Pak

Hina.gif

Posted: 09/05/2012 11:04 AM IST
Akistan foreign minister hina rabbani khar

hena

భారత్‌తో స్నేహ సంబంధాల పునరుద్ధరణ కోసం అసాధారణ రీతిలో సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకున్నామని పాకిస్తాన్ ప్రకటించింది. జమ్మూకాశ్మీర్‌సహా ద్వైపాక్షిక వివాదాల పరిష్కారానికి ఎంతో కృషి చేశామని చెప్పుకుంది. కొద్దిరోజుల్లో భారత విదేశాంగ మంత్రి ఎస్.ఎం.కృష్ణ పర్యటించనున్న తరుణంలో పాక్ ప్రకటన వెలువడటం గమనార్హం. భారత్‌ను అత్యంత ఆప్త దేశంగా పాక్ భావిస్తోందని, ఇది ఇరు దేశాల సంబంధాల్లో సాధారణ పరిస్థితి తీసుకురావడానికి దోహదపడిందని పాక్ విదేశాంగ మంత్రి హీనా రబ్బానీ ఖర్ పేర్కొన్నారు. ఈ రకమైన ధోరణి వల్ల సంబంధ బాంధవ్యాలు పరిపుష్టం అవుతాయని ఆమె తెలిపారు. కీలకమైన జమ్మూకాశ్మీర్ అంశం సహా ద్వైపాక్షిక సంబంధాల పరిష్కారానికి ఈ బంధం ఎంతో దోహదపడుతుందని పేర్కొన్నారు. ముఖ్యమైన పొరుగుదేశంగా భారత్‌ను పాక్ భావిస్తోందని, ఇరు దేశాల మధ్య సంబంధాలను సాధారణ స్థాయికి తీసుకురావడానికి ప్రస్తుత ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలే ఉదాహరణ అని పేర్కొన్నారు. బెర్లిన్‌లోని జర్మన్ కౌన్సిల్‌లో దౌత్య సంబంధాలు అంశంపై జరిగిన సదస్సులో ఆమె మాట్లాడుతూ పైవిధంగా వ్యాఖ్యానించారు. ఐరాస భద్రతా మండలి సూచించిన పరిష్కారమే కాశ్మీర్ సమస్యకు సరైన ముగింపు అని స్పష్టం చేశారు. ఇరు దేశాలమధ్యనున్న బలమైన సంబంధాలు కాశ్మీర్ సమస్యపై తీర్మానం చేసేందుకు దోహదపడగలవని నమ్ముతున్నట్లు రబ్బానీ పేర్కొన్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Skydiver survives 13000 ft drop as parachute fails
Dasari narayana rao interrogated by cbi in coal scam  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles