అశ్లీల డీవీడీలు, సీడీలను అద్దెకు ఇవ్వడం పాత ట్రెండ్.. బూతు చిత్రాలతో కూడిన సెల్‌ఫోన్‌ను అద్దెకు తిప్పడం లేటెస్ట్ ట్రెండ్ ఇది.. 'ఆ' సెల్‌ఫోన్ అద్దెకు ఇవ్వబడుతుంది.. విద్యార్థులు ఆ సెల్‌ఫోన్ కోసం ఎగబడుతున్నారు.. పోటీలు పడి మరీ సెల్‌ఫోన్‌ను అద్దెకు దక్కించుకుంటున్నారు.. తేని జిల్లాలో ప్రస్తుతం 'హాట్' టాపిక్‌గా మారింది. 'తా చెడ్డ కోతి వనమెల్లా చెరిపింద'నే సామెతను నిజం చేస్తూ ఓ ప్రబుద్ధుడు రోజుకు రూ.50 చొప్పున ఈ అద్దె సెల్‌ఫోన్‌ను తిప్పుతున్నాడు. తేని జిల్లాలోని విద్యార్థుల మధ్య ప్రస్తుతం హాట్ టాపిక్ అద్దెకు అశ్లీల సెల్‌ఫోన్. కేవలం బూతుబొమ్మలు, చిత్రాలు మాత్రమే డౌన్లోడ్ చేసుకున్న సెల్‌ఫోన్ అది. ఒక్క రోజు రూ. 50 చెల్లిస్తే రోజంతా బూతు బొమ్మలను చూస్తూ దాహం తీర్చుకోవచ్చు. ప్లస్ వన్, ఐటీఐ చదివే విద్యార్థులు ఈ అద్దె సెల్‌ఫోన్ వ్యామోహంలో పడి సదరు సెల్‌ఫోన్ కోసం పోటీ పడుతున్నారు. ఓ ఐటీఐ విద్యార్థికి తట్టిన ఆలోచనల్లో నుంచే ఈ బూతు బొమ్మల అద్దె సెల్‌ఫోన్ పుట్టింది. తన వద్ద ఖరీదైన సెల్‌ఫోన్ ఉండడంతో పలువురు ఆ సెల్ఫోన్లో ఫొటోలను చూసేందుకు ఆసక్తి కనబరచడాన్ని క్యాష్ చేసుకోవాలని భావించిన సదరు విద్యార్థి కేవలం బూతు సినిమాలు, బూతు బొమ్మలను డౌన్లోడ్ చేసి అద్దెకు తిప్పేందుకు నిర్ణయించుకున్నాడు.
ఇందుకు రోజుకు రూ.50 అద్దెను నిర్ణయించాడు. ఒక్కొక్క విద్యార్థికి ఈ సమాచారం పాకడంతో అందరూ సదరు సెల్‌ఫోన్‌ను అద్దెకు తీసుకునేందుకు ఎగబడుతున్నారు. ఖరీదైన సెల్ఫోన్లను కొనుగోలు చేయలేని పేద విద్యార్థులు సైతం ఈ సెల్ఫోన్లో బూతు బొమ్మలు చూసే అవకాశముండడంతో రూ.50లను చెల్లించేందుకు ఆసక్తి కనబరుస్తున్నారు. తరగతి గదిలో ఖరీదైన సెల్‌ఫోన్ రోజుకో విద్యార్థి చేతుల్లోకి మారుతుండడంతో అనుమానం వచ్చిన ఉపాధ్యాయులు ఆ సెల్‌ఫోన్‌ను తీసుకుని పరిశీలించి అవాక్కయ్యారు. ఈ విషయమై విద్యార్థులను నిలదీయగా అసలు విషయం బయటపడింది.ఇప్పటికే ఇంటర్నెట్లు, కంప్యూటర్లు అందుబాటులోకి వచ్చి విద్యార్థులను సక్రమమైన దారిలో పెట్టడం తలకు మించిన భారంగా ఉన్న నేపథ్యంలో రోజుకో కొత్త ఆలోచనలతో పాడైపోతున్న విద్యార్థులను ఎలా బాగు చేయాలంటూ ఉపాధ్యాయులు తలలు పట్టుకుంటున్నారు. అద్దెకు సెల్‌ఫోన్ తతంగం రాష్ట్ర వ్యాప్తంగా వ్యాపించి ఉండవచ్చనే అనుమానాలను తల్లిదండ్రులు వ్యక్తం చేస్తున్నారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more