Cases of dengue fever increasing in city

Cases of dengue fever increasing in City, hyderabad,

Cases of dengue fever increasing in City

dengue.gif

Posted: 09/12/2012 05:22 PM IST
Cases of dengue fever increasing in city

Cases of dengue fever increasing in City

రాష్ట్ర రాజదానిలో  డబ్బులు కోసం ఏపని అయిన చేయటానికి సిద్దంగా తయారవుతున్నారు.  గతంలో  డబ్బులిస్తే.. మనిషి హత్య చేసే వారు. కానీ ఇప్పుడు అదే డబ్బుకోసం కొంత మంది డాక్టర్లు కొత్త రూట్ లో వెళ్లుతున్నారు. ప్రాణం పోసే డాక్టర్లే..  పేద వాడి ప్రాణాలతో  ఆటలాడుతున్నారు.  ఇప్పుడు వారికి కొన్ని ఆసుపత్రులు అడ్డగా మారాయి.  కార్పొరేట్‌ ఆసుపత్రులు కాసుల కక్కుర్తి బయటపడింది. డబ్బుకోసం ఎంతకైనా బరితెగించే వైనం వెలుగుచూసింది. లేని రోగాలు చూపించి.. కార్పొరేట్‌ ఆసుపత్రులు గల్లా పెట్టెలు నింపుకుంటున్నాయి. ఇది ఎవరో చెప్తున్నది కాదు... సాక్షాత్తు వైద్యశాఖ అధికారుల మాట ఇది. హైదరాబాద్‌లో ఇటీవల డెంగ్యూ కేసులు పెరిగిపోయాయి. లంగర్ హౌజ్, గుడిమల్కాపూర్, కార్వాన్, ప్రాంతాలనుంచి డెంగ్యూ కేసులు ఎక్కువ నమోదు అవుతున్నాయి. దీనిపై నిఘాపెట్టిన సర్కారుకు అసలు విషయం తెలిసింది. కాసుల  కక్కర్తి కోసం అనుమానిత డెంగ్యూ కేసులను కూడా డెంగ్యూగా చూపించి కొన్ని కార్పోరేట్ హాస్పిటల్స్‌ మోసం చేస్తున్నాయని రుజువైంది. ఇలా రోగులను మోసం చేసిన  ఐదు కార్పొరేట్ ఆసుపత్రులకు జిల్లా వైద్య అధికారులు నోటీసులు జారీ చేసారు.ఈ ఏడాదిలో ఇప్పటివరకు 65 అనుమానిత డెంగ్యూ కేసులతో పాటు 12 డెంగ్యూ కేసులు నమోదు అయ్యాయి. కిందటేడాదితో పోలిస్తే ఈ సంఖ్య ఎక్కువ. దీనిపై ఆరా తీస్తే ఇందులో బోగస్‌ డెంగ్యూ కేసులున్నాయని తెలిసింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Girl students sexually harassed by school teacher
Mulayam singh yadav targets upa and nda  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles