Adivasis launch jala deeksha

Adivasis, launch,Jala Deeksha, Polavaram project

Adivasis launch ‘Jala Deeksha’

Jala Deeksha.gif

Posted: 10/19/2012 11:46 AM IST
Adivasis launch jala deeksha

Adivasis launch ‘Jala Deeksha’

ఆదివాసీలను జల సమాధి చేసే పోలవరం ప్రాజెక్టు మాకొద్దంటూ పీపుల్స్ ఎగనెస్ట్ పోలవరం ప్రాజెక్టు (పిఏపిపి) ఆధ్వర్యంలో ఆంధ్ర, ఒడిశా, చత్తీస్‌గఢ్ రాష్ట్రాలకు చెందిన ఆదివాసీలు ఖమ్మం జిల్లా కూనవరంలోని శబరి, గోదావరి సంగమంలో ఒక్కరోజు జలదీక్ష చేపట్టారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణంతో ఆంధ్రప్రదేశ్, ఒడిశా, చత్తీస్‌గఢ్ రాష్ట్రాల్లోని ఆదివాసీల మనుగడే ప్రశ్నార్థకంగా మారనుందని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా పిఏపిపి అధ్యక్షుడు ప్రభాకర్ హంతల్, ప్రధాన కార్యదర్శి సున్నం వెంకట రమణ మాట్లాడుతూ ఓ ప్రక్క ప్రభుత్వ జీవ వైవిధ్య సదస్సులంటూ మరో పక్క పర్యావరణానికి అవసరమైన అడవులను, ఆదివాసీలను ముంచి బహుళార్థ ప్రాజెక్టులు ఎలా చేపడుతుందని ప్రశ్నించారు. జీవ వైవిధ్య సదస్సులో కనీసం పోలవరం ప్రాజెక్టు ప్రస్తావన రాకపోవడంతో ఈ జలదీక్షకు దిగినట్లు తెలిపారు.

Adivasis launch ‘Jala Deeksha’

ప్రాజెక్టు నిర్మాణంతో మూడు రాష్ట్రాల్లోని 550 గ్రామాలు, 2.5 లక్షల మంది నిర్వాసితులు అవుతుండగా నాలుగు లక్షల ఎకరాల సాగు భూమి ముంపునకు గురవుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. పంచాయతీరాజ్‌లోని పీసా చట్టం క్లాజ్ -1 ప్రకారం బహుళార్థ ప్రాజెక్టుల నిర్మాణానికి గ్రామ సభల ఆమోదం తప్పనిసరి అని గుర్తు చేస్తూ 50 వేల కంటే ఎక్కువ మంది నిర్వాసితులయ్యే ప్రమాదం ఉంటే ప్రాజెక్టులకు అనుమతులు లేవని నిబంధనలు చెబుతున్నా రాష్ట్ర ప్రభుత్వం మొండిగా వ్యవహరిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్ర పర్యావరణ శాఖ 2011 ఫిబ్రవరి 8న పర్యావరణ అనుమతిని నిరాకరించిందని, అయినా రాష్ట్ర ప్రభుత్వం నిర్మాణాలను వేగవంతం చేయడంపై సుప్రీంకోర్టుకు వెళ్తామని స్పష్టం చేశారు. పోలవరం నిర్మాణాన్ని వ్యతిరేకిస్తూ ఆంధ్ర, ఒడిశా, చత్తీస్‌గఢ్ రాష్ట్రాల్లో కూడా వేర్వేరుగా జల దీక్షలు చేపడతామని వెల్లడించారు. చివరిగా త్వరలో ఛలో ఢిల్లీ చేపట్టనున్నట్లు పేర్కొన్నారు. ఈ జలదీక్షలో మూడు రాష్ట్రాల నుంచి సుమారు 500 మంది పాల్గొన్నారు. 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Bjp will seal borders if returned to power
Satyam raju properties worth rs 822 crore attached  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles