తెలుగు దేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు చేస్తున్న పాదయాత్ర 25 రోజులకు చేరుకున్న విషయం తెలిసిందే. అయితే మొదటి ఆయన పాదయాత్రలో అపశ్రుతి చోటుచేసుకుంది. మహబూబ్‌నగర్ జిల్లా గద్వాల పట్టణం! శుక్రవారం రాత్రి 9 గంటలు! చేనేత పరిరక్షణ సమితి నాయకులు పాదయాత్ర చేస్తున్న చంద్రబాబుకు సన్మానం చేశారు! చంద్రబాబు ప్రసంగించారు! పరిరక్షణ సమితి నాయకులు కిందకి దిగి వెళుతున్నారు! అదే సమయంలో, టీడీపీలో చేరేందుకు కొంతమంది నాయకులు వేదికపైకి ఎక్కారు! అంతే.. తాత్కాలికంగా ఏర్పాటు చేసిన వేదిక ఒక్కసారిగా కుప్పకూలింది. అసలే అది చిన్న వేదిక. ఎక్కువమంది దానిపై ఎక్కడంతో నిట్టనిలువుగా పడిపోయింది. దాంతో, చంద్రబాబు ఒక్కసారిగా కుడి వైపునకు కూలబడిపోయారు. వేదికపై ఉన్నవారు ఒకరిపై మరొకరు పడిపోగా.. చంద్రబాబుపైనా కొంతమంది పడిపోయారు. వేదిక కూలగానే, 'సార్‌ను చూసుకోండి.. సార్‌ను చూసుకోండి' అంటూ నాయకులు గన్‌మెన్‌లు ఒక్కసారిగా వేదిక వద్దకు పరుగెత్తారు. ఘటన జరిగిన వెంటనే తేరుకున్న బ్లాక్ క్యాట్ కమెండోలు, వ్యక్తిగత భద్రతా సిబ్బంది చంద్రబాబును పైకి లేపారు. సురక్షితంగా కిందకు తీసుకు వచ్చారు.అనూహ్యంగా ఘటన జరగడంతో చంద్రబాబు సహా నేతలంతా ఒక్కసారిగా దిగ్భ్రాంతికి గురయ్యారు. వేదికపై నుంచి కిందకు వచ్చిన తర్వాత చంద్రబాబు మాట్లాడారు. "దేవుడి దయ వల్ల సురక్షితంగా ఉన్నాం. ఎవరికీ ఏమీ కాలేదు'' అని అన్నారు.
కార్యకర్తలు ఆందోళన చెందవద్దని స్పష్టం చేశారు. దీంతో, పార్టీ కార్యకర్తలు బాణసంచా తీసుకువచ్చి కాల్చి సంతోషం వ్యక్తం చేశారు. అనంతరం బాబు యథావిధిగా పాదయాత్రను తిరిగి ప్రారంభించారు.ఒక కిలోమీటరు మేర పాదయాత్ర కొనసాగించారు. అయితే, వేదికతోపాటు చంద్రబాబు కూడా కుప్పకూలడం, ఆయనపై కొంతమంది పడిపోవడంతో ఆయన వెన్నెముకపై ఒత్తిడి పెరిగింది. కిలోమీటరు నడక కొనసాగించిన తర్వాత ఆ నొప్పి మరికాస్త ఎక్కువైంది. దీంతో, చంద్రబాబు పాదయాత్రను కొనసాగించలేకపోయారు. రాత్రి బసకు రెండు కిలోమీటర్లకు ముందే చంద్రబాబు పాదయాత్రను నిలిపి వేశారు. అక్కడే బస చేశారు. అయితే, ముందు జాగ్రత్త చర్యగా హైదరాబాద్ నుంచి ప్రత్యేక వైద్యులను గద్వాలకు రప్పిస్తున్నారు. వారు వచ్చి చంద్రబాబును పరిశీలించనున్నారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more