Bjp leader venkaiah naidu comment on congress party

BJP leader Venkaiah Naidu, Congress party, Sonia gandhi, government, bjp, congress, mim party,

bjp leader venkaiah naidu comment on congress party

venkaiah naidu.gif

Posted: 11/20/2012 07:13 PM IST
Bjp leader venkaiah naidu comment on congress party

bjp leader venkaiah naidu comment on congress party

తెలంగాణ విషయంలో కేంద్రం ఇచ్చిన హామీని నిలబెట్టుకోలేదని భారతీయ జనతాపార్టీ సీనియర్ నేత వెంకయ్యనాయుడు అన్నారు. తెలంగాణ విషయమై ఉభయ సభల్లోనూ నిలదీస్తామని అన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎంత త్వరగా కూలితే అంత మంచిదని, తమ పార్టీ అలానే భావిస్తుందని వెంకయ్యనాయుడు స్పష్టం చేశారు. బీజేపీ పార్లమెంటరీ సమావేశం ఆ పార్టీ సీనియర్ నేత ఎల్‌కె అద్వానీ నివాసంలో మంగళవారం జరిగిన అనంతరం వెంకయ్యనాయుడు మీడియాతో మాట్లాడుతూ వచ్చే శీతాకాల పార్లమెంట్ సమావేశాల్లో చిల్లర వర్తకంలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను, సబ్సిడీ గ్యాస్ సిలిండర్ల పెంపు, బొగ్గు కుంభకోణం, అధిక ధరలు, కరవు అంశాలపై ప్రభుత్వాన్ని నిలదీస్తామని ఆయన చెప్పారు. ఈ అంశాలపై ప్రధానంగా చర్చ జరిపేందుకు డిమాండ్ చేస్తామని పేర్కొన్నారు.నల్లధనానికి సంబంధించిన వ్యక్తుల జాబితాను వెల్లడించాలని కేంద్రాన్ని కోరినట్లు వెంకయ్య చెప్పారు. ఎంఐఎం అడిగిన 41 డిమాండ్లు, ఏమిటి? వాటిపై ప్రభుత్వ వైఖరి ఏమిటన్నది వెల్లడించాలని, మహావీర్ స్థలం ఇచ్చేందుకు సీఎం ప్రతిపాదించారన్న ఎంఐఎం వ్యాఖ్యలపై వివరణ ఇవ్వాలని వెంకయ్యనాయుడు డిమాండ్ చేశారు. ఎంఐఎం సంక్షేమం కోసమే ఇలాంటి ప్రతిపాదనలు కానీ, మైనార్టీల సంక్షేమం కోసం కాదని ఆయన వ్యాఖ్యానించారు. ఏసీబీ నేతలకు క్లీన్ చిట్ ఇచ్చిందన్న అంశంపై ప్రభుత్వం వివరణ ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. మజ్లిస్‌ను పెంచి పోషించిందే కాంగ్రెస్ అని దుయ్యబట్టారు.కాగా, యూపీఏ ప్రభుత్వంపై తృణమూల్ కాంగ్రెస్ ప్రవేశపెట్టే అవిశ్వాస తీర్మాణంకు మద్దతు ఇచ్చే విషయంపై ఇవాళ సాయంత్రం జరిగే ఎన్డీయే పక్షాల సమావేశంలో నిర్ణయం తీసుకుంటామని వెంకయ్య స్పష్టం చేశారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Ajmal kasab hanged at yerwada jail in pune
Anti bal thackeray facebook post 9 held for vandalizing clinic in palghar  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles