Mp vijayasathi says no differences with kcr

MP Vijayasathi, trs mp vijayashanthi, kcr, K Chandrasekhar Rao, medak mp

MP Vijayasathi said on Monday that there is no differences with Party chief K Chandrasekhar Rao

MP Vijayasathi.png

Posted: 11/26/2012 04:12 PM IST
Mp vijayasathi says no differences with kcr

kcrతెలంగాణ రాష్ట్రసమితి పార్టీ చాలా రోజుల తరువాత నిన్న నల్గొండ జిల్లా సూర్యపేటలో ఎంతో ప్రతిష్టాత్మంగా తెలంగాణ సమర భేరి సభను నిర్వహించిన విషయం తెలిసిందే. ఈ సభకు తెలంగాణ వాదులు భారీగా హాజరయ్యారు. వీరితో పాటు తెలంగాణ రాష్ట్రసమితి నాయకులు అందరు హాజరయ్యారు. కానీ తెలంలగాణ పార్టీ నాయకురాలు, మెదక్ ఎంపీ అయిన విజయశాంతి మాత్రం ఈ సభకు హాజరు కాలేదు. అయితే ఈమె హాజరు కాకపోవడం పై రాజకీయ వర్గాల్లో గాలి వార్తలు బయలు దేరాయి. కేసీఆర్ ని అన్నలా భావించే రాములమ్మ రాకపోయే సరికి విజయశాంతికి , కెసిఆర్ కు ఏమైనా విభేదాలు వచ్చాయా అన్న ప్రచారం ఆరంభమైంది. దానిపై విజయశాంతి వివరణ ఇస్తూ, టీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్తో తనకు ఎలాంటి విబేధాలు లేవని చెప్పారు.దీనిపై జరుగుతున్నప్రచారంలో వాస్తవం లేదని ఆమె తెలిపారు. గత రెండు రోజులుగా తీవ్ర జ్వరంతో బాధపడుతున్నందున సూర్యాపేట సమరభేరి సభకు హాజరు కాలేకపోయానని విజయశాంతి తెలిపారు. ఈ విషయాన్ని కేసీఆర్కు ముందే చెప్పానని ఆమె పేర్కొన్నారు. గతంలో కూడా ఈమె కేసీఆర్ కి దూరం అవుతుందనే వార్తలు కూడా వచ్చాయి. అయితే వాటన్నింటిని ఖండిస్తూ విజయశాంతి విమరణ ఇచ్చింది. దీంతో ఆ వార్తలకు తెరపడినట్లే అంటున్నారు రాజకీయ విశ్లేషకులు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Smoking may be linked to ageing of the brain
Deshapati srinivas comment on leaders  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles