అక్రమ గనుల ఘనుడు గాలి జనార్థన్ రెడ్డికి గట్టి ఎదురు దెబ్బ తగిలింది. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) గాలి అక్రమాల పై ఉక్కుపాదం మోపింది. గాలి జనార్థన్ రెడ్డికి బ్రాహ్మణి స్టీల్స్ లో షేర్లు 884.13 కోట్ల ఆస్తులను జప్తు చేస్తున్నట్లు బెంగుళూరులో ప్రకటించింది. ఈ ఆస్తులను అక్రమ చలామణీ నిరోధక చట్టం(పీఎంఏల్‌ఏ) కింద చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. 2007 – 2010ల మధ్య చేపట్టిన అక్రమ గనుల తవ్వకాలపై చేపట్టిన విచారణలో భాగంగా ఆస్తుల్ని జప్తు చేశామని పేర్కొంది. ఓబుళాపురం మైనింగ్ కంపెనీ సుమారు రూ.884.13 కోట్ల విలువైన ఖనిజాన్ని అక్రమంగా తవ్వి, తరలించి బ్రహ్మణి స్టీల్స్‌లో పెట్టుబడిగా పెట్టిందని విచారణలో వెల్లడైందని ఈడీ అధికారులు తెలిపారు. 884.413 రూపాయలకు గాను రూ.10 ముఖ విలువ ఉన్న 88,41,30,000 షేర్లను జప్తు చేసినట్లు ఒక ప్రకటనలో తెలిపారు. ఇక బ్రాహ్మణీ కంపెనీకి సంబంధించిన అధికారులకు ఈడీ కొన్ని ఆదేశాలు కూడా జారీ చేసింది. ఈ ప్లాంటుకు సంబంధించిన భూమిని, యంత్రాలను, ఇతర పరికరాలను అక్కడి నుంచి తరలించరాదు. మరొకరికి విక్రయించడంగానీ, లీజుకు ఇవ్వడంగానీ చేయరాదు అని అందులో పేర్కొంది. ఈ చర్యతో గాలి జనార్దన రెడ్డి వర్గీయుల్లో గుబులు మొదలైంది. ప్రస్తుతానికి బ్రహ్మణితో సరిపెట్టారని... భవిష్యత్తులో బళ్లారిలోని ఆస్తులను కూడా జప్తు చేసే అవకాశాలున్నాయని బెంబేలెత్తుతున్నారు. ఈ పరిణామం గాలి జనార్థన్ రెడ్డికి కోలుకోలేని దెబ్బే అని అంటున్నారు. రాబోయే రోజుల్లో మరిన్ని దెబ్బలు తగిలినా ఆశ్చర్యపోనక్కర్లేదు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more