Konda surekha fire on kcr

Konda Surekha, kcr, ysrcp leader, trs party leader, kcr family,

Konda Surekha fire on KCR at parakal

Konda Surekha fire on KCR.png

Posted: 12/17/2012 08:36 AM IST
Konda surekha fire on kcr

surekhaరాజకీయ నాయకులు ఒకరి పై ఒకరు విమర్శలు చేసుకోవడం సర్వసాధారణం. కానీ ఒక్కొక్కప్పుడు ఆ విమర్శలు మితిమీరి చేస్తారు. అధికారం కోసమైనా కావచ్చు లేక ఇంకేమైనా కావచ్చు వారు మాట్లాడే మాటలు పద్దతి లేకుండా ఉండటమే కాకుండా, రాజకీయ నాయకులు ఇంత దిగజారి మాట్లాడతారా అని, వీరు నాయకులేనా అని ప్రజలు అనుకునేంతగా మాట్లాడుతారు. తాజాగా మాజీ ఎమ్మెల్యే, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకురాలు అయిన కొండా సురేఖ పరకాలలో మాట్లాడుతూ... తెలంగాణ కోసం ఇప్పటి వరకు ఎందరో విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకున్నారు. కానీ తెలంగాణ రావాలంటే.... కేసీఆర్ కుటుంబం మొత్తం ఆత్మహత్య చేసుకుంటే తెలంగాణ రావడం ఖాయమని అన్నారు. తెలంగాణ అమరుల రక్తం తాగి టీఆర్ఎస్‌ను కేసీఆర్ బలోపేతం చేసుకుంటున్నారని, పది మంది విద్యార్థులను బలి చేసి సోనియాతో ప్యాకేజీ మాట్లాడుకోవడం కేసీఆర్కు అలవాటుగా మారిందని అన్నారు. 28న జరిగే అఖిలపక్ష సమావేశంలో వైఎస్సార్‌సీపీ తెలంగాణకు అనుకూలంగా లేఖ ఇస్తే ఎన్ని రోజుల్లో తెలంగాణ తెస్తారో టీఆర్ఎస్ బహిరంగంగా చెప్పాలని డిమాండ్ చేశారు. ఆలోగా తెలంగాణ తేకపోతే టీఆర్ఎస్ నేతలు వైయస్సార్ సీపీలోకి రావాలని, ఒకవేళ తెలంగాణ తెస్తే తాము టీఆర్ఎస్ వెనకాల నడుస్తామని సురేఖ స్పష్టం చేశారు. ఏది ఏమైనా కొండా సురేఖ ఇలా రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయవద్దని అంటున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Girl gang raped in moving bus in delhi
Bangai anantaiha in congress party meeting  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles