Sharmila breaks her pada yatra

ysr congress party leader sharmila, sharmila breaks her pada-yatra, ranga reddy district, injury to her knee, sharmila, apollo hospital, maro praja prasthanam padayatra, operation,

sharmila breaks her pada-yatra

sharmila.gif

Posted: 12/17/2012 03:48 PM IST
Sharmila breaks her pada yatra

sharmila breaks her pada-yatra

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి  సోదరి షర్మిలా చేస్తున్న పాదయాత్రకు అంతరాయం ఏర్పాడింది. తెలంగాణ రంగారెడ్డి జిల్లాలో చేస్తున్న షర్మిలాకు కాలు నొప్పి రావటంతో  ఆమె పాదయాత్రకు సెలవు ప్రకటించారు. అయితే ఆమె కాలి గాయంతో షర్మిల  జూబ్లీహిల్స్ అపోలో ఆస్పత్రిలో చేరారు. ఆమె మోకాలుకు వైద్యులు శస్త్ర చికిత్స చేయనున్నారు. కాగా షర్మిలకు ఆసరేషన్.... విశ్రాంతి అవసరమని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా నిర్ణయించదని ఎమ్మెల్యే శోభా నాగిరెడ్డి తెలిపారు. విశ్రాంతి అనంతరం షర్మిల పాదయాత్రను కొనసాగిస్తారని ఆమె పేర్కొన్నారు.  షర్మిల కాలికి రేపు ఆపరేషన్‌ చేయడానికి ఏర్పాట్లు చేస్తున్నట్లు డాక్టర్ సోమశేఖర్‌ రెడ్డి తెలిపారు. ఎంఆర్‑ఐ స్కాన్‑లో షర్మిల గాయం తీవ్రమైనట్లు తేలింది. ఆమె కుడి మోకాలిలో రెండు రకాల గాయాలయ్యాయని డాక్టర్ తెలిపారు. షర్మిలకు కీ హోల్ ఆపరేషన్ చేస్తామన్నారు. ఆపరేషన్ తర్వాత కాలికి సిమెంట్ కట్టు కట్టాల్సి ఉందని చెప్పారు. మూడు వారాల తర్వాత కట్టు తొలగిస్తామన్నారు. ఆ తర్వాత మరోసారి పరిశీలించి నిర్ణయం తీసుకుంటామని డాక్టర్ చెప్పారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles