కామంతో కళ్లు మూసుకుపోయిన మగవాడికి కళ్ళకు ఏమి కనిపించదని మరోసారి రుజువు అయ్యింది. సొంత మేనత్తపై మేనల్లుడు తన స్నేహితులతో కలిసి కామవాంచ తీర్చుకున్నాడు...ఆకలితో ఉన్న మేనత్తకు భోజనం పెట్టిస్తానని చెప్పి బయటికి తీసుకెళ్లి.. స్నేహితులతో కలిసి సామూహిక అత్యాచారానికి పాల్పడ్డాడో దుర్మార్గుడు! కర్నూలులో అర్ధరాత్రి ఈ దారుణం జరిగింది. బాధితురాలు, బంధువులు తెలిపిన వివరాల మేరకు.. బ్రాహ్మణకొట్కూరు సమీపంలోని ఒక గ్రామానికి చెందిన మహిళ కర్నూలు ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బంధువులను పరామర్శించేందుకు వచ్చారు. ఆ మహిళ మేనల్లుడు.. ఆమెకు భోజనం పెట్టిస్తానని చెప్పి ఆటోలో బయటికి తీసుకెళ్లాడు. మార్గమధ్యంలో మరో నలుగురిని ఆటోలో ఎక్కించాడు. ఆటోను గుత్తి పెట్రోలు బంకు వైపు పోనిచ్చాడు. పెట్రోలుబంకు దాటిన తర్వాత వీరంతా మహిళను ముళ్లపొదల్లోకి తీసుకెళ్లి సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. తీవ్రంగా గాయపరిచారు. తిరిగి ఆమెను బైక్పై తీసుకెళ్లి ఆసుపత్రిలో వదిలేసి పారిపోయారు. గాయపడిన బాధితురాలిని గమనించిన సమీప బంధువు ఒకరు.. ఆమెను ఆస్పత్రిలో చేర్పించి చికిత్స చేయించారు. సాయంత్రానికి తేరుకున్న బాధితురాలు అసలు విషయం తెలిపింది. జరిగిన దారుణంపై మహిళా సంఘాలు మండిపడ్డాయి. అత్యాచారానికి పాల్పడిన వ్యక్తులను కఠినంగా శిక్షించాలని ఐద్వా రాష్ట్ర ఉపాధ్యక్షురాలు నిర్మలమ్మ డిమాండ్ చేశారు. కాగా.. ఈ విషయమై పోలీసులకు ఎలాంటి ఫిర్యాదూ అందలేదు. ఈ ఘాతుకానికి పాల్పడిన నిందితులు గతంలో కూడా పలు అత్యాచారాలకు పాల్పడినట్లు సమాచారం.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more