Vhp bajrang dal warn against valentine day

vishwa hindu parishad issuing a warning, vhp, vishwa hindu parishad, bajrang dal, valentine day, marriage,

vhp, bajrang dal warn against valentine day. warning was issued by leaders of the Vishwa Hindu Parishad ... Asserting that they were not against love

valentine-day.gif

Posted: 02/14/2013 10:26 AM IST
Vhp bajrang dal warn against valentine day

vhp, bajrang dal warn against valentine day

ప్రేమికుల రోజ ను అపురూపంగా  జరుపుకొనేందుకు యువతీ యువకులు  సన్నాహాలు చేసుకుంటున్నారు.  బహుమతులు  కొనేందుకు  వచ్చిన ప్రేమికులతో   దుకాణాల వద్ద  సందడి  కనిపించింది.   అయితే కొన్ని  సంస్థల బెదిరింపులకు  భయపడాల్సిన  పని లేదని పోలీసులిచ్చిన  భరోసా  వీరికి మరింత  ఉత్సాహాన్ని  ఇస్తోంది.  అసలే మాఘమాసం ఆపై ప్రేమికుల రోజు.  వేలాది  జంటలు  పెళ్లివేడుకతో  ఒక్కటవుతున్నాయి.  ప్రేమికుల రోజే పెళ్లి చేసుకోవటం చాలా అద్రుష్టంగా భావిస్తానాయి కొన్ని పెళ్లి జంటలు.  ప్రేమికులు కనిపిస్తే పెళ్లి చేయడం లేదా వారి తల్లిదండ్రుల సమక్షంలో కౌసలింగ్ చేయాల్సి వస్తుందని బజరంగ్‌దళ్, ఆర్‌ఎస్‌ఎస్, విహెచ్‌పిలు ప్రకటించాయి. విష సంస్కృతి, పాశ్చాత్య సంస్కృతి, విదేశీ సంస్థలు భారతదేశంపైనా, భారతీయ సంస్కృతిపైనా, సంప్రదాయం పైనా జరుపుతున్న దాడుల్లో భాగమే వాలైంటైన్స్ డే అని ఎబివిపి రాష్ట్ర కార్యదర్శి ఎ. భాను ప్రకాశ్ వ్యాఖ్యానించారు. ఫిబ్రవరి 14న వాలైంటైన్స్ డే నిర్వహించుకోరాదని ఆయన హితవుపలికారు. ప్రేమను గౌరవించాలని, అయితే ప్రేమ పేరుతో వ్యాపారం, విషపు చర్యలు తగవని అన్నారు. తాము ప్రేమకు వ్యతిరేకం కాదని, ప్రేమ ముసుగులో జరుగుతున్న అశ్లీలతకు, వ్యాపారానికి మాత్రమే వ్యతిరేకమని చెప్పారు. తల్లిదండ్రులకు, విద్యార్ధులకు, భారతీయ యువతీయువకులకు తాము ఈ విషయమై చైతన్యం కలిగిస్తున్నట్టు చెప్పారు. ప్రేమికుల రోజు సందర్భంగా తమ వ్యాపారం కోసం పబ్‌లలో, రెస్టారెంట్లలో, రిసార్టుల్లో, బేకరీల్లో ఆఫర్ల పేరుతో యువతీయువకులను పెడదారి పట్టించేలా ప్రోత్సహిస్తున్న సంస్థలను, యాజమాన్యాలను ఆయన హెచ్చరించారు. ప్రేమికులు తమ పద్ధతి మార్చుకోకుంటే తీవ్ర పరిణామాలను ఎదుర్కోవల్సి వస్తుందని ఆయన పేర్కొన్నారు. ఫిబ్రవరి 14న ప్రేమికుల రోజున ప్రేమికులు కనిపిస్తే వారికి కౌన్సిలింగ్ నిర్వహిస్తామని అన్నారు.

vhp, bajrang dal warn against valentine day

వారితో పాటు వారి తల్లిదండ్రులనూ పిలిపించి కౌన్సిలింగ్ నిర్వహిస్తామని, అవసరమైతే పెళ్లిళ్లు కూడా జరిపిస్తామని ఆయన పేర్కొన్నారు.  అయితే కొంత మంది మాత్రంపార్కులో కూర్చున్న వారి వావి వరసలు సైతం తెలుసుకోకుండా తాళి కట్టించడం అనైతిక చర్యేనని అంతేగాక, కండబలంతో అమాయకులను వేధించడం సరికాదని మానవ హక్కుల కమిషన్ చైర్మన్ జస్టిస్ నిస్సార్ అహ్మద్ కక్రూ వ్యాఖ్యానించారు. ఆదేశాలు జారీ చేశారు. ప్రేమికుల దినోత్సవం ఫిబ్రవరి 14న ఎలాంటి దౌర్జన్యపు చర్యలూ జరగకుండా చూసి వారం రోజుల్లోగా నివేదిక ఇవ్వాలని హైదరాబాద్ నగర పోలీసు కమిషనర్‌ను మానవ హక్కుల కమిషన్ చైర్మన్ ఆదేశించారు. ఫిబ్రవరి 14న ప్రేమికుల దినం రోజున పార్కుల్లో కూర్చున్న యువతీయువకులపై కొందరు మత ఛాందస వాదులు బలవంతపు పెళ్లిళ్లు చేస్తామని బెదిరిస్తున్నారని అచ్యుతరావు అనే న్యాయవాది మానవహక్కుల కమిషన్‌కు ఫిర్యాదు చేశారు. ఒక పౌరునిగా, న్యాయవాదిగా మానవ హక్కుల కమిషన్‌ను ఆశ్రయించినట్లు తెలిపారు. ఆయన పిటిషన్‌పై తీవ్రంగా స్పందించిన మానవ హక్కుల కమిషన్ ఈ మేరకు ఆదేశాలు ఇచ్చింది.

vhp, bajrang dal warn against valentine day

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Cm morphed photo in circulation online
Petrol diesel prices to be hiked again  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles