వైఎస్పార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్ మరో షాక్ తగిలింది. అక్రమాస్తుల కేసులో రూ. 122 కోట్ల రూపాయల ఆస్తులను స్వాధీనం చేసుకోవడానికి ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ)కు న్యాయ ప్రాధికార సంస్థ అనుమతి ఇచ్చింది. గతంలో జగన్ ఆస్తుల కేసులో రూ. 51 కోట్లు, ఎమ్మార్ ప్రాఫర్టీస్ కుంభకోణం కేసులో రూ. 71 కోట్ల ఆస్తుల్ని ఈడీ అటాచ్ చేసిన విషయం తెలిసిందే. ఈ రూ.122 కోట్ల ఆస్తులను చూసుకునేందుకు ఈడీ అనుమతి పొందింది. దీనిపై ఈడీ న్యాయ ప్రాధికార సంస్థ విచారణ జరిపి ఈ మేరకు ఈడీకి అనుమతి ఇచ్చింది. జగన్ ఆస్తుల కేసులో ఈడి మనీలాండరింగ్ చట్టాల ఉల్లంఘనలను ఈడీ నిర్ధారించి గతంలో నోటీసులు జారీ చేసింది. ఈ మేరకు ఈడి రూ. 51 కోట్ల రూపాయల విలువ చేసే స్థిర, చరాస్తులను జప్తు చేయడానికి నిర్ణయం తీసుకుంది. కుట్రల ద్వారా తాము ఆస్తులు జప్తు చేసిన సంస్థలు ప్రభుత్వం నుంచి ప్రయోజనం పొందాయని ఈడీ వ్యాఖ్యానించింది. ఈ మేరకు నోటీసులు జారీ చేసింది. హెటిర్ డ్రగ్స్‌కు చెందిన 35 ఎకరాల భూమిని, రూ.3 కోట్ల రూపాయల ఫిక్స్‌డ్ డిపాజిట్లను ఈడీ జప్తు చేయాలని నిర్ణయం తీసుకుంది.
అలాగే జననీ ఇన్‌ఫ్రాకు చెందిన 13 ఎకరాల భూములను కూడా జప్తు చేయడానికి అనుమతి పొందింది. వైయస్ జగన్‌కు చెందిన జగతి పబ్లికేషన్స్ సంస్థకు చెందిన రూ. 14.5 కోట్ల రూపాయల ఫిక్స్‌డ్ డిపాజిట్లను ఈడి జప్తు చేసింది. అరబిందో ఫార్మాకు చెందిన 96 ఎకరాల భూమి, రూ. 3 కోట్ల రూపాయల ఫిక్స్‌డ్ డిపాజిట్లను ఈడీ జప్తునకు నోటీసులు జారీ చేసింది. హెటిరో డ్రగ్స్, అరబిందో ఫార్మా సంస్థలకు 75 ఎకరాల భూములను కేటాయించడం వల్ల ఆ సంస్థలు రూ. 8.6 కోట్ల రూపాయల చొప్పున లబ్ధి పొందాయని ఈడి నిర్ధారించింది. ట్రైడెంట్‌కు 30.33 ఎకరాల భూములను కేటాయించారని, దాని వల్ల ఆ సంస్థ రూ. 4.3 కోట్ల రూపాయల ప్రయోజనం పొందిందని ఈడీ వివరించింది. హైదరాబాదులోని గచ్చీబౌలి బౌల్టర్ హిల్స్‌లో గల 34 విల్లా స్థలాల స్వాధీనానికి ఈడికి అనుమతి లభించింది. ఎమ్మార్ ప్రాఫర్టీస్‌కు చెందిన రూ. 7 కోట్ల ఆస్తులను ఈడీ స్వాధీనం చేసుకోనుంది.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more