Intelligence reports are routine in nature

hyderabad bomb blast, dilsukhnagar, botsa satyanarayana, intelligence reports.

intelligence reports are routine in nature but not specific.

intelli-warnings.png

Posted: 02/23/2013 10:32 AM IST
Intelligence reports are routine in nature

ఉగ్రవాది తన కసి పూర్తిగా తీర్చుకుంటున్నాడు.  రద్దీగా ఉండే ప్రదేశాలను ఎన్నుకోవటం, సాధ్యమైనంత ఎక్కువ నష్టం, భయోత్పాదం కలిగించటమే కాకుండా పాలన విధానంలో కూడా చిచ్చుపెడుతున్నాడు. 

అంతా మీ వలనే అని అంటూ ప్రతిపక్ష పార్టీలు నిన్న పార్లమెంటు బడ్జెట్ సెషన్ ని ముందుకు సాగనివ్వలేదు.  ప్రభుత్వ వైఫల్యాన్ని కప్పిపుచ్చుతూ, చనిపోయిన వారికి, గాయపడ్డవారికి నష్టపరిహారాలు అందించి చెయ్యి దులుపుకుంటే సరిపోదని ప్రతిపక్షాల వాదన.  లేదు మేము ముందే సూచన పంపించామని కేంద్ర మంత్రి రాష్ట్ర ప్రభుత్వం మీద వేస్తే, అదేదో మామాలుగా రొటీన్ లో అందిన సూచన అనుకున్నాం అంటారు రాష్ట్ర నాయకులు. 

ఇంటెలిజెన్స్ వారు చేసిన హెచ్చరికలు సాధారణంగా పంపిస్తూవుండేవే కాబట్టి పట్టించుకోలందంటారు ఎపిసిసి అధ్యక్షుడు బొత్సా సత్యనారాయణ.  ఉగ్రవాద చర్యలను కనిపెట్టటం, అరికట్టటం అంత సులభమైన పని కాదు అన్నది ఆయన వాదన. ఈ విషయంలో ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ వివరణను ఇచ్చేవున్నారని, ఘటనా స్థలికి స్వయంగా వెళ్ళటమే కాకుండా సహాయక చర్యలను కూడా సంతృప్తికరంగా తీసుకోవటం జరిగిందని, ప్రతిదానికీ రాజకీయం చెయ్యటం తగదని బొత్సా అన్నారు.

నిజానికి ఉగ్రవాదులు చర్య జరిగే అవకాశం ఉందని ఆంధ్రప్రదేశ్ కే కాకుండా మిగతా దక్షిణాది రాష్ట్రాలకు కూడా హెచ్చరికలు అందాయి.  ప్రయాణం చేసేటప్పుడు జర్ర బద్రం, జాగ్రత్త నాయనా అని చెప్పినట్టు రొటీన్ గా సూచనలిచ్చి అదిగో మేం ముందే చెప్పాం అంటే మరి మిగిలి రాష్ట్రాలలో జరగలేదేం అనాల్సి వస్తుంది.  మరి ప్రతి రోజూ అన్ని రాష్ట్రాలకూ హెచ్చరికలను పంపించి మేం చెప్పలే అంటే దానికి అర్థం లేదు. 

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Fresh red alert received from intelligence bureau
One abdul wounded in two bomb blasts  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles