Ex chief marshal sp tyagi mentioned in pe of cbi

agusta westland copters, s p tyagi, air chief marshal,

ex air hief marshal sp tyagi mentioned in pe of cbi

agusta-copters.png

Posted: 02/26/2013 08:49 AM IST
Ex chief marshal sp tyagi mentioned in pe of cbi

3600 కోట్ల విలువైన ఆగస్టా వెస్ట్ ల్యాండ్ హెలికాప్టర్ల ఒప్పందంలో మధ్యవర్తులుగా వ్యవహరించి అవినీతికి పాల్పడ్డారన్న కేసులో సిబిఐ 11 మంది ప్రాథమిక విచారణను ప్రారంభించింది.  అందులో మాజీ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఎయిర్ ఛీఫ్ మార్షల్ ఎస్.పి.త్యాగి కూడా ఉన్నారు.  త్యాగి తో పాటు ఆయన కజిన్లు, మరో నాలుగు కంపెనీల మీద విచారణను చేపట్టారు. 

వివరాలను సేకరించటం కోసం ఇటలీ వెళ్ళివచ్చిన సిబిఐ, అక్కడ దొరికిన ఆధారాలనుబట్టి త్యాగి, అతని కజిన్లు జూలీ, డోక్సా, సందీప్ త్యాగిలను దోషులుగా పరిగణిస్తూ వారి మీద ప్రాథమిక విచారణను ప్రారంభించారు.  అయితే తన ప్రమేయమేమీ లేదంటున్నారు ఎయిర్ ఛీఫ్ మార్షలం త్యాగి. 

సిబిఐ ఇటలీలో దర్యాప్తు చేసిన తర్వాత తన ప్రాథమిక విచారణకు చేసిన ఆరోపణలోని విషయాలు ఇవి-

ఆగస్టా వెస్ట్ ల్యాండ్ మాతృ సంస్థ ఫిన్మెక్కానికా కొందరు ఇటలీ మధ్యవర్తులకు కమిషన్ ఇచ్చింది.  అందులో క్రిష్టియన్ మైకెల్ ఉన్నారు.  ఈ ఒప్పందం సజావుగా సాగేందుకు ఆయన ద్వారా కొందరు భారత దేశ పౌరులకు ముడుపులు అందాయి.  ఆ లంచం సొమ్ము భారతీయ సంస్థలైన ఐడిఎస్ ఇన్ఫోటెక్, ఎయిరోమాట్రిక్స్ లకు బదిలీలు చెయ్యబడ్డాయి.  సాఫ్ట్ వేర్ అభివృద్ధికోసం ఇస్తున్నట్టుగా ఆ సొమ్ము నెలనెలా ఈ కంపెనీలకు బదిలీ చెయ్యటం జరిగింది.  2007 నుంచి 2012 వరకూ అగస్టా వెస్ట్ ల్యాండ్ కీ, ఐడిఎస్ టునీసియా మధ్య మిలియన్ల యూరోలు బదిలీ అయ్యాయి.  ఆ సంస్థ తన భారత దేశ విభాగానికి నకిలీ బిల్లుల లావాదేవీల రూపంలో పంపించింది.  ఇంకా ఇటలీ సంస్థలు, ఇటలీ మధ్యవర్తులను సిబిఐ తన పిఇ లో పేర్కొంది.  వీళ్ళందరితో పాటు ఎయిరోమాట్రిక్స్ లో లోగడ డైరెక్టర్ గా వ్యవహరించిన లాయర్ గౌతమ్ ఖైతాన్, సిఇఓ ప్రవీణ్ బక్షిలను కూడా సిబిఐ తన ప్రాధమిక విచారణలో పేర్కొంటూ, వారు అవసరమైనప్పుడు పిఇలో చేర్చబడతారని ప్రకటించింది. 

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Malasia flight emergency landing at hyderabad
Bomb found near delhis army hospital defused suspicious bag  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles