More power cuts in the state capital

power cuts in hyderabad, kiran kumar reddy, solar energy, industrial power

more power cuts in the state capital

electricity-supply.png

Posted: 03/07/2013 09:02 AM IST
More power cuts in the state capital

నగరాల్లో, పట్టణాల్లో, జిల్లా మండల కేంద్రాలలో, పల్లెల్లో, వ్యవసాయానికి ఇలా వివిధ వర్గాలకూ విడి విడిగా పంచిన విద్యుత్ కోతలు కూడా సరిపోవటం లేదు.  అనధికారిక కోతలకసలు లెక్కే వుండదు.   రాష్ట్ర రాజధానిలో రెండు గంటలు మాత్రం విద్యుత్ కోత ను విధిస్తామని చెప్పారు, దాన్ని సక్రమంగానే పాటిస్తూ వచ్చారు కానీ, అయినా లెక్క కుదరటం లేదట.  ఏమంటే రబీ పంటలకోసం విద్యుత్ అవసరాలు పెరగటం వలన అక్కడ ఎక్కువ ప్రమాణంలో విద్యుత్ సరఫరా చెయ్యవలసిన అవసరం ఏర్పడుతోందట.

సరే రాజధానికి మూడు గంటలిద్దాం అంటున్నారు- అదే విద్యుత్ కోతలు.  నగరాల్లో, పట్టణాల్లో ఇంకా నయమే.  చిన్న ఊళ్ళల్లో ఎన్ని గంటలు విద్యుత్ తీసారన్న లెక్క కంటే ఎంత సేపు ఇచ్చారు అన్నది చెప్పటం సులభమంటున్నారు.  ఇంతయినా ఇంకా సౌరశక్తి మీద ప్రభుత్వం ఎందుకు దృష్టి సారించదు.  కాలుష్య రహితం, ఉచితం అయిన సౌరశక్తి వాడకాన్ని పెంచితే ఈ కష్టాలు గట్టెక్కుతాయి కదా అంటున్నారు కొందరు మేధావులు.

ప్రజాభిప్రాయమైతే ఇలా ఉంది- విద్యుత్ కోతల వలన కరెంటు బిల్లులో మార్పుంటుందా అంటే అక్కడా లేదు.  విద్యుత్ కోతల వలన బిల్లు మొత్తం ఎంత తగ్గుతుందో లెక్క కట్టి అంతకంటే ఎక్కువే ఛార్జీలు పెంచినట్లనిపిస్తోంది.  బిల్లులు బిల్లులూ ఎక్కువగానే కట్టాలి, కరెంటూ అంతంత మాత్రంగానే ఉంటోంది అంటూ వాపోతున్నారు సామాన్య ప్రజానీకం.  గ్యాస్ సబ్సిడీ తగ్గిపోతుండటం వలన పోనీ కరెంటు మీద ఆధారపడదామా అంటే అది మరీ షాక్ కొడుతోంది అంటూ ప్రభుత్వ వైఖరి పట్ల నిరసనగా కొందరు మాట్లాడుకుంటున్నారు.  

నేను నా జీవితంలో అబద్ధమాడలేదు తెలుసా అన్నాడు ఒక పెద్ద మనిషి.  అదే పెద్ద అబద్ధమన్నాడు మరో మనిషి.  ఏది ఏమైనా, మావన్నీ కోతలే అన్నట్టున్నాయి ప్రభుత్వ విధానాలు.  నాయకులు ఏవేవో భరోసాలిస్తుంటే అవన్నీ కోతలే అంటున్నారు.  ఇప్పుడు అంతా కోతల సామ్రాజ్యంలావుంది అంటూ కొందరు విశ్లేషకులు విమర్శిస్తున్నారు.  నిన్న మెదక్ జిల్లా జహీరాబాద్ లో మహీంద్రా అండ్ మహీంద్రా ట్రాక్టర్ల ఉత్పత్తి కేంద్రాన్ని ప్రారంభించిన ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, కరెంటు కోతల వలన పారిశ్రామిక రంగం చాలా దెబ్బతింటోందని, అందుకు అవసరమైన ప్రత్యామ్నాయ విధానాలను పరిశీలిస్తున్నామని, అక్టోబర్ నెల కల్లా విద్యుత్ సరఫరా నియంత్రిస్తామని, విద్యుత్ కోతలను నివారిస్తామని అన్నారు.

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles