Question hour of both houses were wasted

parliament, question hour, sonia gandhi, robert vadra

question hour of both houses were wasted

parliament-disrupted.png

Posted: 03/13/2013 10:36 AM IST
Question hour of both houses were wasted

vadra-in-parliamentపార్లమెంటులో వాద్రా కేసుని చర్చించటానికి ప్రభుత్వం నిరాకరించింది.  

హర్యానా రాజస్తాన్ లలో సోనియా గాంధీ అల్లుడు రాబర్ట్ వాద్రా కు అక్రమంగా భూమిని కట్టబెట్టిన కేసుని పార్లమెంటులో ప్రస్తావించటానికి భారతీయ జనతా పార్టీ కోరగా కాంగ్రెస్ పార్టీ అందుకు అభ్యంతరం తెలిపింది.  వాద్రా రాజకీయ వేత్త కాదని, ఒక పౌరుడు మాత్రమేనని, అటువంటి వ్యక్తి గురించి పార్లమెంటులో చర్చించటం తగదని, రాష్ట్ర ప్రభుత్వాలు, చట్టాన్ని అమలు చేసే యంత్రాంగాలు వాటి విషయాన్ని చూసుకుంటాయని కాంగ్రెస్ వాదించింది.  

వ్యక్తిగత కేసుల గురించి పార్లమెంటులో చర్చించే అవకాశమిచ్చి అటువంటి ఆచారానికి నాంది పలకటాన్ని మేము కోరుకోము అన్నారు కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి రేణుకా చౌదరి.  

వాద్రా, శ్రీలంక తమిళయన్ల సమస్యల వివాదాలతో ఉభయసభలూ ఏమీ చర్చించకుండా ఉండటం నిన్న కాలమంతా వృధా అయింది.  

అయ్యా ఆర్థిక మంత్రి గారూ, అల్లుళ్ళ సిద్ధాంతాన్ని బలపరచండి, ఇంట్లోనుంచే వ్యవహారాలను చక్కబెడుతూ ప్రభుత్వ నష్టాలను పూరించండంటూ భారతీయ జనతా పార్టీ నేతలు చేతుల్లో ప్రకార్డ్ లతో సోనియా గాంధీ సమక్షంలోనే పార్లమెంటులో గందరగోళాన్ని సృష్టించారు.  

అమిత లాభాలను ఆశిస్తూ సీలింగ్ కి మించిన భూమి కొనుగోళ్ళు చేసి రాజస్తాన్ లోని బికానెర్ లో భూమి ధరను పెంచే దిశగా పావులు కదుపుతున్నారంటూ వచ్చిన ఆరోపణ దృష్ట్యా దాన్ని చర్చించాలంటూ భాజపా మాటిమాటికీ పట్టుబట్టటంతో పార్లమెంటులో ప్రశ్నల సమయమంతా ఒట్టిగానే గడిచిపోయింది.  వాద్రా సాధారణ వ్యక్తి కాదు సాక్షాత్తూ అధికార పక్ష అధ్యక్షురాలి అల్లుడంటూ భాజపా అనగా, అయినా ఆయన ఒక వ్యక్తే కానీ రాజకీయాల్లో ఉన్న వ్యక్తి కాడు కనుక అదే స్థితి ఉంటుంది అన్నారు రేణుకాచౌదరి.

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Cbi vehicle stone pelted in up
Ap budget session started with uproad as expected  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles