Srilankan monk surrounded by tamil groups

srilanka monk, tanjavur, tiruchi, tamilnadu, tamil groups, archeological survey of india

srilankan monk surrounded by tamil groups

srilanka-monk.png

Posted: 03/17/2013 09:01 AM IST
Srilankan monk surrounded by tamil groups

archeological-studentsప్రాచీన తంజావూర్ లో బృహదీశ్వరా ఆలయ సందర్శనంలో ఉన్న  శ్రీలంక బౌద్ధ సన్యాసిని చుట్టముట్టి హింసాకాండకు దిగారు అక్కడి తమిళ బృందాలు.  

న్యూఢిల్లీ లోని భారతీయ పురావస్తు పరిశోధన (ఆర్చియాలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా) లో పోస్ట్ గ్రాడ్యుయేషన్ చదువుతున్న 19 మంది  విద్యార్థులలో పాటు బౌద్ధ సన్యాసి కూడా ఉన్నారు.  వారంతా బృహదీశ్వరా ఆలయ సందర్శనం చేసుకుంటున్నారు.  ఆ సమయంలో ఉన్నట్టుండి స్థానిక బృందాలైన నామ్ తమిళార్ కాచ్చి, తమిళ దేశీయ పోధువుదైమే కాచ్చి కి చెందిన వారు సన్యాసి దుస్తులలో కొట్టొచ్చినట్టుగా విడిగా కనిపిస్తున్న పద్బేరీయ ఙానలోక తెరు మీద హింసాకాండకు దిగారు.  దేవాలయ పర్యటనలో వచ్చిన విద్యార్థులలో చాలా దేశాల నుంచి వచ్చిన వారున్నారు.  అందులో శ్రీలంక, చైనా, థాయ్ ల్యాండ్ కూడా ఉన్నాయి.

ఆ ఆలయానికి దగ్గర్లో ఉన్న ఆర్చియాలాజికల్ సర్వే కార్యాలయానికి వాళ్ళని తీసుకెళ్లనా, అల్లరి మూకలు ఆ కార్యాలయాన్ని చుట్టుముట్టి వాళ్ళని బయటకు పంపించమని ఆందోళన చేసారు.   ఆలయంలోని అర్చకులు కూడా ఊహించని ఆ హింసాత్మక సంఘటనకు భయపడిపోయారు.

విద్యార్థులు వేసుకున్న ఇతర కార్యక్రమాలను రద్దు చేసుకుని సన్యాసి దుస్తులను మార్చి వాళ్ళందరినీ రెండు కార్లలో పోలీసు బందోబస్తుతో తిరుచి పంపించారు.  అయితే తిరుచిలో దిగగానే వాళ్ళ మీద రాళ్ళ వానతో స్వాగతం పలికారు అక్కడి మరుమలార్చి ద్రవిడ మున్నేత్ర కళగమ్, నామ్ తమిళార్ కాచ్చి బృందాలు.  ఒక కారుకి ముందు అద్దాలు, మరో కారు వెనక అద్దాలు ధ్వంసమయ్యాయి కానీ విద్యార్థులు దెబ్బలు తగలకుండా తప్పించుకున్నారు.  వాళ్ళు విమానాశ్రయం చేరుకోగానే అక్కడ పోలీస్ కమిషనర్ వాళ్ళకి భద్రతా ఏర్పాట్లను చేసి, బౌద్ధ సన్యాసిని ముందుగా చెన్నై వెళ్ళే విమానం ఎక్కించి, మిగతా విద్యార్థులకు విమానాశ్రయంలో తాత్కాలిక బస ఏర్పాటు చేసారు.  

హింసాకాండకు పాల్పడ్డ తమిళ బృందాలలోని వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  All prepared for nitish kumar rally in delhi
Pawned girls rescued by police  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles