Three attackers on buddhist monk held by railway police

srilanka buddhist monk, attack on buddhist monk, chennei central, railway police

three attackers on buddhist monk held by railway police

attack-on-buddhist.png

Posted: 03/20/2013 08:53 AM IST
Three attackers on buddhist monk held by railway police

సోమవారం చెన్నై సెంట్రల్ రైల్వే స్టేషన్ లో బౌద్ధ సన్యాసి మీద జరిగిన దాడిలో ముగ్గురు నిందితులను రైల్వే పోలీసులు అరెస్ట్ చేసారు.  33 సంవత్సరాల డబ్లు.ఎమ్.కె.భండార ను సోమవారం తమిళనాడు ఎక్స్ ప్రెస్ లో దాడిచేసినవారిని సిసి టివి ల సాయంతో గుర్తించి పట్టుకున్నారు.  ఈ దాడి అప్పడే ప్లాట్ ఫాం మీదకు వచ్చిన రైలులోపల జరిగింది.  

సిసి టివి ఫుటేజ్ లను పరిశీలించి రైల్వే పోలీసులు నిందితులలో ఒక వ్యక్తి టోపీ పెట్టుకుని ఉండటం, గడ్డం ఉండటం గమనించారు.  అతను నామ్ తమిళార్ అనే తమిళ సంఘంలోని పెరియార్ అంబన్ అలియాస్ మీషా శ్రీనివాసన్ అనే వ్యక్తిగా గుర్తుపట్టారు.  అతను ఉండేది ట్రిప్లికేన్ లో అని తెలుసుకున్నారు.  అతని ఇంటికి వెళ్తే అతను పరారీలో ఉన్నట్టుగా తెలిసింది.  దానితో విషయం అర్థమై, ఆ బృందంలోని నిందితులను పట్టుకోవటం కోసం వలపన్నారు.  అది ఫలించి ముగ్గురు పోలీసుల అదుపులోకి వచ్చారు.  మిగతా ఇద్దరిలో ఒక వ్యక్తి 29 సంవత్సరాల శరవణ ప్రకాశ్, మరో వ్యక్తి ప్రభాకరన్

అయితే ఈ దాడులు శ్రీలంక పర్యాటకుల మీద పెద్దగా ప్రభావం చూపించినట్లుగా లేదు.  కాకపోతే అవాంఛిత సంఘటనలు జరగకుండా ఉండటం కోసం ఎక్కువ మంది పోలీసు అధికారులను నియమించి కట్టుదిట్టమైన భద్రతా చర్యలను తీసుకోవటంతోపాటు, బోధ్ గయ నుంచి, ఇతర ప్రాంతాల నుంచి వచ్చే శ్రీలంక పర్యాటకుల వివరాలను న్యూఢిల్లి, ఇతర రాష్ట్రాల నుంచి తీసుకుంటూ, వారి కోసం సురక్షితమైన ఏర్పాట్లను చేస్తున్నారు.

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Dmk withdraws ties with upa
Sonia gandhi step in blasts lanka to mollify karunanidhi  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles