Markandey katju keen on appealing for sanjay dutt

sanjay dutt, markandey katju, supreme court, president of india, governor of a state, indian constitution

markandey katju keen on appealing for sanjay dutt

markandeya-katzu.png

Posted: 03/28/2013 03:49 PM IST
Markandey katju keen on appealing for sanjay dutt

katju-photo

ముక్కుకి సూటిగా పోతూ చెప్పదలచుకున్నది చెప్పే మనస్తత్వమున్న ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఛైర్మన్, మాజీ సుప్రీం కోర్టు జస్టిస్ మార్కండేయ కట్జూ, ఎవరేమనుకున్నా సరే, తను మాత్రం 1993 ముంబై దాడులలో నిందితులుగా శిక్ష ఖరారు చేసిన వాళ్ళల్లో హిందీ నటుడు సంజయ్ దత్, 70 సంవత్సరాల మహిళ జైబ్ ఉన్నీస్సా ఇద్దరూ క్షమాభిక్షకు పాత్రులేనని, వారి బదులు తాను క్షమాభిక్షను కోరుతానని అన్నారు.

ఉద్వేగంతో తాను క్షమాభిక్షను కోరనని, న్యాయస్థానం ఆదేశించినట్టుగా లొంగిపోతానని, శిక్షననుభవిస్తానని చెప్తూ కన్నీటి పర్యంతమైన సంజయ్ దత్ మాటలతో తనుక సంబంధం లేదని, తన ఉద్దేశ్యంలో వారిద్దరూ క్షమాభిక్షకు అర్హులని, రాజ్యాంగంలోని ఆర్టికిల్ 72, 161 లలో క్షమాభిక్షను ఎవరు కోరవచ్చన్నది చెప్పలేదని, ఆర్టికిల్ 72 రాష్ట్రపతికి, ఆర్టికిల్ 161 గవర్నర్ కి క్షమాభిక్షకు అధికారాలనిచ్చిందని కట్జూ అన్నారు.   ఎవరు అప్పీల్ చెయ్యాలన్నదీ అందులో రాయలేదు, ఏ ఆధారం మీద క్షమాభిక్షనివ్వాలన్నదీ రాసి లేదు. ఏ కారణంతోనైనా క్షమాభిక్షనివ్వవచ్చు అని వివరించారు కట్జూ.

-శ్రీజ

 

 

 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Satellite hall of fame to first indian
10 maoists killed by other group  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles