Capital punishment to woman

capital punishment, president of india, first woman hanging, constitution of india

capital punishment to woman

ఉరిశిక్ష అమలు జరగనున్న మొట్ట మొదటి మహిళ సోనియా.

Posted: 04/06/2013 11:58 AM IST
Capital punishment to woman

భారత దేశంలో మహిళా నేరస్తులను ఇంతవరకూ ఉరిశిక్ష విధించటం జరిగినా అమలు పరచటమనేది జరగలేదు.  మొదటిసారిగా హర్యానాకు చెందిన సోనియా ఉరికంబమెక్కబోతోంది.  అత్యంత ఘాతుకానికి ఒడిగట్టినవాళ్ళకే ఉరిశిక్షలను విధించటం జరుగుతుంది.  సోనియా కట్టుకున్న భర్తతో కలిసి తన సొంత కుటుంబాన్నే మట్టుబెట్టింది.  2001 లో ఆస్తి తగాదాల మూలంగా కక్ష పెట్టుకున్న సోనియా భర్త మద్దతుతో తన కన్న తల్లిదండ్రులను తోడబుట్టినవారిని 2007 లో దారుణంగా హత్య చేసింది. 

హర్యనా మాజీ శాసన సభ్యుడు రేలూ రామ్ పూనియా కూతురు సోనియా భర్త సంజీవ్ లకు ఇద్దరికీ ఉరిశిక్ష ఖాయమైంది, వారి క్షమాభిక్షను రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ తిరస్కరించటం కూడా జరిగింది.  సోనియా స్త్రీ అనే అంశాన్ని పరిగణనలోకి తీసుకోవటం జరగలేదు.  పురుషులు స్త్రీలు సమానమని అందరూ వాదిస్తున్న నేపథ్యంలో నేరం చేసినవారెవరైనా చట్టం దృష్టిలో సమానమేనని నిరూపించారు. 

రాజీవ్ గాంధీ హత్య కేసులో నళినికి కూడా ఉరిశిక్ష పడింది.  కానీ సోనియాగాంధీ ప్రమేయంతో ఆ శిక్షను జీవిత ఖైదుగా మార్చటం జరిగింది.  అందువలన సోనియా ఉరిశిక్ష అమలు కాబోతున్న మొదటి మహిళా ఉరిశిక్ష.  సమాన హక్కులలో సమాన బాధ్యతలు కూడా ఉంటాయి., సమాన న్యాయం కూడా ఉంటుంది కాబట్టి ఇందుకు మహిళలు నిజంగా గర్వపడాల్సిన విషయంగా కొందరు విశ్లేషకులు భావిస్తున్నారు.

-శ్రీజ 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles