Last day for revenue meetings at village level

revenue records, land disputes, land records, mutation, vro offices, farmers pass books, registration documents

last day for revenue meetings at village level

రెవిన్యూ సదస్సులకు ముగింపురోజు

Posted: 04/10/2013 09:47 AM IST
Last day for revenue meetings at village level

ఈరోజుతో రెవిన్యూ సదస్సులు మగుస్తున్నాయి.  భూసమస్యలు గ్రామస్థాయిలో చాలా పెద్ద సమస్యలు.  వాస్తవాలకు, రెవిన్యూ రికార్డ్ లకు పొంతన లేకపోవటంతో లబ్ధిదారులు నష్టపోతుంటారు.  పైగా భూ వివాదాలు ముదిరి పరస్పర విభేదాలకు దారితీస్తుంటాయి.  అందువలన, రాష్ట్రంలోని గ్రామస్థాయిలో భూసమస్యలను పరిష్కరించటానికి రాష్ట్ర ప్రభుత్వం చేసిన ప్రయత్నంగా నిర్వహించిన రెవిన్యూ సదస్సులు మార్చి 12 న ప్రారంభమయ్యాయి.  ఎక్కువగా వచ్చిన సమస్యలలో భూమికి సంబంధించిన రికార్డ్ లకు, రిజిస్ట్రేషన్లకు, పట్టాదార్ పాస్ పుస్తకాలకు మధ్య ఉన్న అంతరాలను తొలగించటం, వారసత్వంలో సంప్రాప్తించిన ఆస్తులను రెవిన్యూ రికార్డ్ లలో సవరించటం, ఋణ అర్హతకు చెందిన కార్డ్ లు లభించని కేసులున్నాయి. 

రెవిన్యూ లెక్కల ప్రకారం రాష్ట్రంలో ఉన్న గ్రామాల సంఖ్య 27259.  వాటిలో 27 వేల గ్రామాలలో రెవిన్యూ సదస్సులను నిర్వహించగా సమస్యల పరిష్కారాన్ని కోరుతూ తొమ్మిది లక్షల దరఖాస్తులు రెవిన్యూ అధికారులకు చేరాయి. 

ఒట్టి లెక్కలే కాకుండా, ఈ రెవిన్యూ సదస్సులోని సుగుణాలు- ఒకటి, సమస్యలను 90 రోజులలోగా పరిష్కరించటం, రెండు, అందిన దరఖాస్తులకు రశీదునివ్వటం, మూడు విఆర్వో కార్యాలయాలను ప్రారంభించటం.  17 వేల విఆర్వో కార్యాలయాలు ఇప్పటికే ప్రారంభం కాగా, 90 రోజులలో పరిష్కారానికి బాటలు వేస్తూ వారం రోజులలోగా అందుకు అవసరమైన ప్రణాళికను రూపొందించటానికి పూనుకోవటం విశేషం. 

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles