Stars do not favor politics this is year

visakha sarada peetham, swaroppanandendra swamy, markandey katju, pci chairman, vijaya telugu year

stars do not favor politics this is year

రాజకీయాలకు ప్రతికూలంగా గ్రహస్థితులు

Posted: 04/11/2013 04:11 PM IST
Stars do not favor politics this is year

విజయనామ సంవత్సరంలో రాజకీయ అనిశ్ఛితి చోటుచేసుకుంటుందని విశాఖపట్నం శారదా పీఠాధిపతి స్వరూపానందేశ్వర సరస్వతి స్వామి అన్నారు. 

ఈరోజు నెల్లూరు లో జరిగిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ, పంచాంగం చెప్తున్నదాన్నిబట్టి అక్టోబర్ తర్వాత అల్లకల్లోలం ఏర్పడుతుందని, భూకంపాలలాంటి ప్రకృతి వైపరిత్యాలు ఏర్పడే అవకాశం ఉందని ఆయన అన్నారు.  విజయనామ సంవత్సరంలో గ్రహాలు అనుకూలంగా కనపడటం లేదని చెప్పిన స్వరూపానందేశ్వర సరస్వతి, దాని ప్రభావం దేశం మీద, రాష్ట్రం మీద కూడా ఉండవచ్చునని అన్నారు. 

అయితే ఆంధ్రప్రదేశ్ పర్యటనలో ఉన్న ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఛైర్మన్ మార్కండేయ కట్జూ జ్యోతిష్యం అంతా మూఢనమ్మకమని అన్నారు.  ఈ మాటలకు స్పందించిన స్వామీజీ, ఆ వ్యాఖ్యలు కట్జూ అవగాహన రాహిత్యాన్ని తెలియజేస్తున్నాయని అన్నారు.  ఆయన న్యాయశాస్త్రంలో ఉద్దండులు కావచ్చు కానీ అన్ని శాస్త్రాలలో కాదు అని, ఆయనేమీ సర్వజ్ఞలు కాలేదని అన్నారు. 

పంచాంగాన్ని, భూమిమీద జంతు జీవరాశుల మీద గ్రహస్థితుల ప్రభావాన్ని సైన్స్ కూడా నమ్ముతోందని, పౌర్ణమి, అమావాస్య, గ్రహణకాలాల్లో సముద్రంలోను, భూమి మీద జంతువులు, ఆకాశంలో విహరించే పక్షుల మీద ఎంతో ప్రభావం పడుతుంటుందని, అనేక మైన మార్పులకు కారణమవుతాయని విజ్ఞానశాస్త్రం కూడా నమ్ముతోందని స్వరూపానందేశ్వర స్వామి అన్నారు. 

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles