Wedding knots on daughter

wedding knot, engagement, machilipatnam, jalakandriga village, child marriage, woman development and child welfare project

wedding knots on daughter

కూతురి మెడలో మంగళసూత్రం

Posted: 04/14/2013 09:08 AM IST
Wedding knots on daughter

కూతురికి మంగళ సూత్రం అది కూడా తల్లి కట్టటం.  కూతురేమో 12 సంవత్సరాల మైనర్ బాలిక. ఈ సంఘటన మచిలీపట్నం సమీపంలో జలకంద్రిగ గ్రామంలో జరిగింది. 

ఈ సంఘటనకు పూర్వాపరాలు ఇలా ఉన్నాయి.  శుక్రవారం నాడు 5 వ తరగతి చదువుతున్న అమ్మాయికి 20 సంవత్సరాల యువకుడితో పెళ్ళికి తాంబూళాలు పుచ్చుకోవటం జరిగింది.  కానీ పెళ్ళి కొడుకు కుటుంబానికి, పెళ్ళి కూతురు కుటుంబానికి మధ్య తగాదా వచ్చి పెళ్ళికొడుకు వాళ్ళు అక్కడి నుంచి వెళ్ళిపోయారు.  వెంటనే అమ్మాయి తల్లి కూతురి మెడలో తాళి కట్టేసి, ఆ యువకుడు బలవంతంగా పెళ్ళి చేసుకుని పారిపోయాడంటూ ఫిర్యాదు చేసింది. 

మైనర్ బాలిక వివాహం జరిగిందని తెలిసిన కృష్ణా జిల్లా మహిళాభివృద్ధి, శిశు సంరక్షణ ప్రాజెక్ట్ డైరెక్టర్, పోలీసులు ఆ స్థలానికి చేరుకున్నారు.  పెళ్ళి కొడుకు మీద వత్తిడి పెంచటం కోసమే తల్లి అమ్మాయి మెడలో తాళి బొట్టు కట్టిందన్న సంగతి దర్యాప్తులో తేలింది. 

ఆ అమ్మాయికి 18 సంవత్సరాలు నిండేంతవరకూ వివాహం తలపెట్టవద్దంటూ అధికారులు ఆమెకు సూచించి, అందుకు కుటుంబ సభ్యులు సమ్మతించినట్లుగా రాత పూర్వకంగా తీసుకున్నారు.  ఈ విషయాలన్నీ మహిళాభివృద్ధి, శిశు సంరక్షణ ప్రాజెక్ట్ డైరెక్టర్ ఎన్.వి.రాఘవరావు స్వయంగా చెప్పారు. 

-శ్రీజ

 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles