Amitabh bachan and rajni kant meet at cannes

amitabh bachan, rajnikant, cannes film festival, andha kanoon, kochadian, the great gatsby

amitabh bachan and rajni kant meet at cannes

ఉత్తర దక్షిణ తారలు ఒకేవేదిక మీద

Posted: 04/14/2013 11:56 AM IST
Amitabh bachan and rajni kant meet at cannes

ఉత్తర భారత సినిమారంగంలో ధృవతారగా నిలిచిన అమితాభ్ బచ్చన్, దక్షిణ పథాన సూపర్ స్టార్ రజినీకాంత్ మే నెలలో ఒకే చోట తళుక్కుమనబోతున్నారు.  వేదిక కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్.

మే నెలలో జరుగబోతున్న కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ లో అమితాభ్ బచ్చన్ నటించిన మొదటి హాలీవుడ్ చిత్రం ది గ్రేట్ గాట్స్ బీ తరఫున అమితాభ్ హాజరవుతుంటే, రజనీకాంత్ తన కొత్త కొచ్చాడియాన్ చిత్రం ట్రైలర్ ని ప్రదర్శనకు హాజరవుతున్నారు. 

నిజానికి రజనీకాంత్ ఉన్న పరిస్థితుల్లో ఆయన అంత దూరం విమాన ప్రయాణం చెయ్యగూడదు.  కానీ కొచ్చాడియాన్ రూపొందుతున్న తీరుని చూసిన రజనీకాంత్ చిన్నపిల్లవాడిలా గంతులు వేస్తున్నారట.  అమితాభ్ బచ్చన్ ని ఉదాహరణగా తీసుకుంటూ, ఆయన ఎలా పోరాడారు, ఎంత పెద్ద అనారోగ్యం నుంచి తేరుకుని మళ్ళీ సినిమారంగంలో నిలిచారన్నది చూస్తే అది తనకి స్పూర్తినిస్తుందంటారాయన. 

అమితాభ్ బచ్చన్, రజనీకాంత్ లు కలిసి నటించిన చిత్రం అంధా కానూన్.  ఆ ఇద్దరి మధ్య మైత్రీ భావనతో పాటు ఒకరిమీద మరొకరికి అభిమానం మొదటి నుంచీ అలాగే వుంది. 

-శ్రీజ

 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles