దేశంలో అమ్మాయిలపై జరుగుతున్న దాడులకు నిరసనలతో మహిళ లోకం మండిపడుతుంది. ఇలాంటి సమయంలో ఒక రాజకీయ నాయకుడు కొడుకు కూడా అమ్మాయిలను టార్గెట్ చేసినట్లు తెలుస్తోంది. అయితే అతను సోషల్ వెబ్ సైట్ లను వేదికగా చేసుకున్నారు. తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత, సినీ నిర్మాత మాగంటి బాబు పెద్ద కుమారుడు రాంజీని అరెస్టు చేసేందుకు పోలీసులు రంగం సిద్ధం చేశారు. ఫేస్ బుక్ ద్వారా అమ్మాయిలకు అసభ్యకర మెసేజ్ లు పంపించాడన్న అభియోగంతో రాంజీని అరెస్టు చేయనున్నట్లు సమాచారం. బెంగుళూరు సాఫ్ట్వేర్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్న వివాహితకు అసభ్యకర ఈ మెయిల్స్ పంపినట్లు సైబర్‌క్రైమ్ పోలీస్ స్టేషన్లో మాగంటి రాంజీపై కేసు నమోదైంది. సెక్షన్ 506,509 ఐటీ యాక్ట్ కేసు నమోదు చేశారు. ఈ మేరకు సైబరాబాద్ సైబర్ క్రైం పోలీసులు పశ్చిమగోదావరి జిల్లా ఏలూరులోని మాగంటి బాబు ఇంటికి వెళ్లారు. ఇదిలా ఉండగా.. అసభ్యకర మెసేజ్ లతో రాంజీ తనను వేధిస్తున్నాడని ఓ అమ్మాయి చేసిన ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసు విషయమై విచారణకు హాజరు కావాలని గతంలో పలు మార్లు రాంజీకి సమాచారం ఇచ్చారు. అయినా.. ఆయన తేలిగ్గా తీసుకున్నట్లు సమాచారం. దీంతో అరెస్టు చేయడానికి పోలీసులు సిద్ధమయ్యారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more